టీవీ: ఓటీటి లవర్స్ గుడ్ న్యూస్.. ఈ రొజు ఒక్కటే ఎన్ని సినిమాలంటే..?

Divya
ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినీ ప్రేక్షకులు సైతం ఓటీటి లో సినిమాలు చూడడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. థియేటర్ కు వెళ్లేవారు సంఖ్య ప్రతిరోజు తగ్గుతోంది. ముఖ్యంగా థియేటర్లలో ఉండే అధిక ధరల వల్ల సామాన్య ప్రేక్షకులు కూడా థియేటర్ వద్దకు వెళ్లాలి అంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. అందుచేతనే ఓటీటిల హవా బాగా పెరిగిపోతుంది. మరి ఈ వారం ఓటీటి లో విడుదల అయ్యి సినిమాల గురించి ఒకసారి తెలుసుకుందాం.
1). యశోద:
సమంత నటించిన యశోద చిత్రం గత నెల విడుదలై మొదటి రోజు మంచి సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఓటీటి లో డిసెంబర్ 9వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది.
2). మాచర్ల నియోజకవర్గం:
నితిన్, కృతి సెట్టి జంటగా నటించిన ఈ చిత్రం భారీ డిజాస్టర్ ను చవిచూసింది. డిసెంబర్ 9 వ తేదీన ఈ సినిమా జి ఫైవ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
3). ఊర్వశివో రాక్షసివో:
అల్లు శిరీష్ ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో హీరోయిన్గా అను ఇమ్మానియేల్ నటించింది. ఈ చిత్రంతో అల్లు శిరీష్ పర్వాలేదు అనిపించుకున్నారు. డిసెంబర్ 9 వ తేదీన ఆహా లో స్ట్రిమింగ్ కాబోతోంది.

4). లైక్ షేర్ సబ్స్క్రిప్షన్:
సంతోష్ శోభన్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా డైరెక్టర్ వేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రిప్షన్ ఈ చిత్రం సోనీ లీవ్ లో డిసెంబర్ 9 వ తేదీన స్ట్రిమింగ్ కాబోతోంది.

5). కాంతారా:
తక్కువ బడ్జెట్ తో విడుదలైన చిత్రం కాంతారా ఈ ఏడాది అత్యధికంగా కలెక్షన్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే పలు భాషలలో ఓటీటిలో విడుదలైన ఈ చిత్రం హిందీ వర్షాన్ డిసెంబర్ 9 వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: