వైన్ గ్లాస్ తో చిల్ అవుతున్న అనసూయ..ఫోటోలు వైరల్..!

Divya

ప్రముఖ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ముఖ్యంగా ఆమెకు సోషల్ మీడియాలో అలాగే బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో అంతకంటే ఎక్కువ వెండితెరపై దక్కించుకుంది. ప్రస్తుతం పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ స్టార్ నటీమణిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె మరింత పాపులారిటీని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇకపోతే న్యూస్ రీడర్గా తన కెరీర్ ను మొదలు పెట్టిన ఈమె.. ఆ తర్వాత యాంకర్ గా వ్యవహరిస్తూ బుల్లితెరపై ప్రముఖ టాప్ యాంకర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల ఒక పార్టీలో అనసూయ సందడి చేసినట్లు ఆ ఫోటోల ద్వారా స్పష్టం అవుతుంది. ఆ పార్టీలో అనసూయ వైన్ గ్లాస్ చేతిలో పట్టుకొని దిగిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అవి బాగా వైరల్ గా మారుతున్నాయి. అనసూయ చేతిలో వైన్ గ్లాస్ ఉండడం చూసి నెటిజెన్లు షాక్ అవుతున్నారు. మరి కొంతమంది ఏమో తాగుతున్నావా అనూ? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవ్వడమే కాకుండా ఆమెపై చాలామంది రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ కనిపించడానికి బయటకు సాఫ్ట్ గా ఉన్నా.. తనను ఎవరైనా కెలికితే మాత్రం ఖచ్చితంగా లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంలో ముందుంటుంది. అందుకే తనపై ఎవరైనా విమర్శలు చేస్తే ప్రతి విమర్శ ఇస్తూ మరింతగా వారికి ముచ్చమటలు పట్టిస్తుంది . అందుకే అనసూయ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఏది ఏమైనా అనసూయ ఇప్పుడు మరో కొత్త వివాదం లోకి ఇరుకుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: