రేవంత్ కు ప్రమాద ఘంటికలు... రిలాక్స్ అయ్యాడా టైటిల్ కష్టమే ?

VAMSI
బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు లో ఇక మిగిలి ఉంది కేవలం మూడు వారాలే... గత 11 వారాలుగా బిగ్ బాస్ హౌస్ లో జర్నీ చేసిన చేస్తున్న ఇంటి సభ్యులు అంతా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి తమ శాయశక్తులా ప్రయత్నించారు. కానీ కొందరు మాత్రం జనాలను విపరీతంగా ఆకట్టుకోగా, మరికొందరు అంచనాలను అందుకోలేక బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. నిన్న ఎలిమినేషన్ లో ఇంటి నుండి వెళ్లిపోయిన మోడల్ రాజును తీసివేస్తే ప్రస్తుతం హౌస్ లో ఉన్నది ఎనిమిది మంది మాత్రమే. వారిలో రేవంత్, రోహిత్, శ్రీహన్ , ఆదిరెడ్డి , శ్రీసత్య , కీర్తి, ఫైమా మరియు ఇనాయాలు ఉన్నారు. ఇక ఈ రోజు నుండి హౌస్ లో పోటీ మాములుగా ఉండదు..
ఈ వారం కనుక సేవ్ అయితే ఖచ్చితంగా మిగిలిన ఏడుగురికి టాప్ 5 లో చోటు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలా కసిగా ఈవారం ఆట కొనసాగుతుంది, అదే సమయంలో పోటీని మరింత రసవత్తరంగా మార్చడానికి బిగ్ బాస్ కఠినమైన టాస్క్ లను ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక శనివారం హౌస్ లోకి వచ్చిన పోటీదారుల కుటుంబ సభ్యుడు మరియు మద్దతుదారులు భావిస్తున్న ప్రకారం కేవలం ఒక్కరు మినహాయించి మిగిలిన ఎనిమిది మంది కూడా ఇంటిలో ఉన్న అందరికీ బలమైన పోటీదారుడు రేవంత్ నే అని చెప్పారు. వాస్తవంగా రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారు.
ఇక కొన్ని సోషల్ మీడియా చానెళ్లు అయితే బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా రేవంత్ అని ఖచ్చితంగా చెబుతున్నారు. బిగ్ బాస్ లో ముగిసిన 5 సీజన్ లలో కూడా ఎక్కువగా సోషల్ మీడియా చానెళ్లు చెప్పిన కంటెస్టెంట్ లు మాత్రమే విన్నర్లు గా మారారు. అలా చూసుకుంటే రేవంత్ విన్నర్ అవుతాడన్నది తెలుస్తోంది. అయితే ఆట ఏమాత్రం ఆడకుంటే కూడా ప్రేక్షకులు రేవంత్ ను గెలిపిస్తారు అంటే మాత్రం పొరపాటు పడినట్లే. ఖచ్చితంగా ఈ మూడు వారాలు ఇంకా కసిగా ఆడితేనే మిగిలిన వాళ్ళ కన్నా ఎక్కువ ఓట్లు పడి విజేతగా నిలుస్తాడు, లేదంటే కీర్తి, ఇనాయ మరియు సత్య లాంటి వాళ్ళు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: