టీవీ: మహేష్ ఫ్యాన్స్ చేతిలో చివాట్లు తింటున్న జబర్దస్త్ కమెడియన్..!!

Divya
టాలీవుడ్ సినీ నటుడు మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. మహేష్ బాబు చిన్నతనం నుండే ఎన్నో చిత్రాలలో నటించి ప్రస్తుతం స్టార్ హీరోగా పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలోనే మహేష్ సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి తండ్రి కృష్ణ గారు ముగ్గురు కూడా కాలం చెల్లించారు. ఇలా ఒకేసారి తన కుటుంబ సభ్యులను కోల్పోవడంతో మహేష్ ప్రస్తుతం చాలా దుఃఖంలో ఉన్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

ఇక అసలు విషయంలోకి వెళ్తే  మహేష్ బాబు కెరియర్ లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రం ఒక్కడు. ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్ అతని మేనరిజానకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ చిత్రం తర్వాతే మహేష్ బాబు మాస్ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు. ఈ చిత్రానికి సంబంధించి జబర్దస్త్ కమెడియన్ నూకరాజు మహేష్ బాబును ఇమిటేట్ చేయడం జరిగింది. అయితే అంతటి ఘనత ఉన్న ఆ సినిమాకి స్పూఫ్ ని జాతి రత్నాలు ఇమ్మానియేల్,  నూకరాజు చాలా అపహాస్యం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

వారి స్కిట్ లలో ఈ సినిమా పైన స్పూఫ్ చేసి హద్దు మీరీ ప్రవర్తించినట్లుగా మహేష్ ఫ్యాన్స్ వీరిపైన ఫైర్ అవుతూ ఉన్నారు. జాతి రత్నాలు షో తో ఏదో ఒక స్కిట్ చేస్తున్న వీళ్ళు ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు సూపర్ హిట్ గా నిలిచిన ఈ ఒక్కడు చిత్రాన్ని స్ఫూప్ చేయగా.. నూకరాజు ఇ స్కిట్ లో కాస్త ఓవరాక్షన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కడు సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ని నూకరాజు చేసి ముక్కున వేలుతో తాకుతూ ఓవర్ చేయడం జరిగింది అలా చేస్తూ మొన్న కాలీఫ్లవర్లు చేశాడు.. ఈరోజు నేను మహేష్ బాబు అంటూ తనదైన స్టైల్ లో డైలాగ్ డెలివరీ చేస్తూ వచ్చారు ఈ డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ వల్ల అభిమానులు నూకరాజును విపరీతంగా ట్రోల్ చేయడమే కాకుండా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: