టీవీ: గెటప్ శ్రీను చేజేతులారా కెరియర్ను నాశనం చేసుకుంటున్నారా..!!

Divya
తెలుగు బుల్లితెర మీద టాప్ కామెడీ షో లో ఒకటైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ షో నుంచి ఎంతోమంది కమెడియన్స్ సైతం బుల్లితెరపైనే కాకుండా వెండితెర పైన కూడా కమెడియన్లుగా ఒక వెలుగు వెలుగుతున్నారు.అలా బుల్లితెర నుంచి వెండితెర మీదికి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు.ఈ షో నుంచి చాలామంది హీరోయిన్లుగా కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ టీంకు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.
ముఖ్యంగా రాంప్రసాద్ ,గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్, సన్నీ ఇలా అందరూ కలిసి స్కిట్లు చేసే ప్రేక్షకులను బాగా నవ్వించేవారు. అయితే కొన్ని కారణాల చేత సుధీర్ గెటప్ శ్రీను ఎక్స్ ట్రా జబర్దస్త్ విడిచి వెళ్లడం జరిగింది. బుల్లితెరపై గెటప్ శ్రీనును బుల్లితెర కమల్ హాసన్ అన్న పేరు కూడా సంపాదించారు. గెటప్ శ్రీను చేతిలో ప్రస్తుతం కొన్ని సినిమాలు ఉండగా ఈ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండడం చేత బుల్లితెరకు కాస్త దూరంగా ఉన్నారు.

ఇటీవలే గెటప్ శ్రీను గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించారు అయితే రీసెంట్గా గెటప్ శ్రీను కొన్ని కామెంట్లు చేయడం వల్ల చిక్కుల్లో పడ్డారు.. ఇటీవలే యంగ్ హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో గెటప్ శ్రీను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక రేంజ్ లో పొగిడేయడం జరిగింది. ఇండస్ట్రీకి మరొక రాజమౌళి దొరికారు అంటూ కామెంట్లు చేయడంతో రాజమౌళి అభిమానులు సైతం హర్ట్ అయ్యారు. ఇక ప్రశాంత వర్మ కూడా గొప్ప డైరెక్టర్ కానీ రాజమౌళితో పోల్చడం కరెక్ట్ కాదని రాజమౌళి అభిమానులు భావిస్తూ ఉన్నారు. దీంతో గెటప్ శ్రీను పై పలు ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఈ సమయంలో గెటప్ శ్రీను ఫ్రెండ్స్ అయినటువంటి సుధీర్, రాంప్రసాద్, సపోర్టుగా నిలవకపోవడంతో వారిని కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: