బిగ్ బాస్ 6: ఎలిమినేషన్... "డేంజర్ జోన్ లో రాజ్" ?

VAMSI
బిగ్ బాస్ సీజన్ 6 ఈ సారి చాలా రసవత్తరంగా ప్లాన్ చేశారు మేకర్స్. మొదటి నుండి కూడా ఊహించని ఎలిమినేషన్ లతో ప్రేక్షకులను చాలా బాగా ఎంటర్ టైన్ చేస్తోంది అని చెప్పాలి . ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఈ సీజన్ జరుగుతోంది. గత 80 రోజులుగా జరుగుతున్న ఈ షో చివరి అంకానికి చేరువైంది. మరో మూడు వారాలలో ఈ సీజన్ ముగియనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో 9 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో టాప్ 5 లో ఎవరు నిలువనున్నారు అన్న విషయంపై గత వారం హౌస్ లో చర్చ జరిగింది. దాని ప్రకారం టాప్ లో రేవంత్ , శ్రీహన్ , పైమా, శ్రీసత్య మరియు ఆదిరెడ్డి లు ఉండే అవకాశం ఉందని ఇంటి సభ్యులు అభిప్రాయపడ్డారు.
అయితే ఇది కేవలం వారి వారి అభిప్రాయాలు మాత్రమే.. కాగా ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లే వారిలో 7 మంది ఇంటి సభ్యులు నామినేషన్ లో ఉన్నారు. వారిలో శ్రీహన్, రాజ్, ఆదిరెడ్డి , శ్రీ సత్య, ఫైమా, ఇనాయా మరియు రోహిత్ లు ఉన్నారు. కెప్టెన్ గా ఉండడం కారణంగా రేవంత్ నామినేషన్ లో లేకపోగా, కీర్తి కూడా నామినేషన్ నుండి బయటపడింది. కాగా ఈ వారం అందరికీ నామినేషన్స్ చాలా ముఖ్యం. ఉన్నవారిలో శ్రీహన్ , ఆది రెడ్డి , ఇనాయ మరియు పైమాలు సేవ్ అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరు అంతా కూడా వరుసగా ఎలిమినేట్ అవుతూ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటూ పోవడం వలన ఎక్కువ ఓట్లు పోలయ్యి సేవ్ అవుతారని తెలుస్తోంది.
ఇక మిగిలిన రోహిత్, శ్రీసత్య, రాజ్ లలో ఒక్కరు ఎలిమినేట్ అవ్వడం మాత్రం పక్కా అని తెలుస్తోంది. అయితే ఆ ఒక్కరు ఎవరు అన్నది మాత్రం సస్పెన్స్. ఈ ముగ్గురిలో ఎక్కువ శాతం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ రాజ్ కు మాత్రమే ఉందని సమాచారం. ఎందుకంటే గత మూడు వారాలుగా రాజ్ నామినేషన్స్ లో లేకపోవడం మరియు గత రెండు వారాలు పెద్దగా రాజ్ ఆడకపోవడం వంటి కారణాలు ప్రభావం చూపించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు నుండి శుక్రవారం లోపు ఆటలో బాగా రాణించకపోతే ఖచ్చితంగా రాజ్ ఎలిమినేట్ అవుతాడు అని మీడియా వర్గాలు అనుకుంటున్నారు.      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: