టీవీ: బిగ్ బాస్ హౌస్ లో మెరీనా పారితోషికం ఎంతంటే..?

Divya
మెరీనా అబ్రహం.. పలు యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే సీరియల్స్ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మెరీనా అబ్రహం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ప్రముఖ సీరియల్ నటుడు రోహిత్ ను వివాహం చేసుకుంది. అయితే బిగ్బాస్ హౌస్లోకి జంటగా వచ్చిన వీరు మరింత పాపులారిటీని దక్కించుకున్నారు. మొదటి నుంచి బిగ్ బాస్ హౌస్ లో 21 మంది కంటెస్టెంట్లు రావడంతో ఇద్దరినీ ఒకే కంటెస్టెంట్ గా పరిగణించిన బిగ్ బాస్.. ఆ తర్వాత కంటెస్టెంట్లు తగ్గిపోవడంతో ఎవరి ఆట వారే ఆడాలని ఇద్దరినీ విడదీశారు. అలా ఓట్లు కూడా విడదీయడం జరిగింది.
బిగ్బాస్ హౌస్ లో ఉన్నంతసేపు చాలా సౌమ్యంగా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా వంటగదికే ఎక్కువ సమయం కేటాయించిన మెరీనా.. అందరిలో మదర్ ఇండియా గా పేరు పొందింది.  హౌస్ మేట్స్ అందరూ ఈమెను ముద్దుగా మదర్ ఇండియా అని పిలుచుకునేవారు . ఇక ఎవరైన ఈమెను ఇబ్బంది పెట్టినా.. ఈమె మాత్రం వారిని పల్లెత్తి మాట కూడా అనేది కాదు.  అంత సౌమ్యంగా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగడం చాలా కష్టం.. అకారణంగా అయినా సరే గొడవ పెట్టుకోవాల్సిందే. కానీ అది మెరీనా చేతకాక ఎట్టకేలకు పదకొండవ వారం ఎలిమినేట్ అయింది.

కానీ ఇది కొంతమంది ఈ విషయం పై తప్పు పడుతున్నారు శ్రీ సత్య వల్లే సౌమ్యురాలైన మెరీనాను ఎలిమినేట్ చేశారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేస్తూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా 11 వారాలకు గాను ఎంత పారితోషకం తీసుకుంది అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది.11 వారాలకు గాను వారానికి రూ. 35000 చొప్పున మొత్తం మూడు లక్షల ఎనిమిది వేల రూపాయలను మెరీనా పారితోషకంగా పొందినట్లు తెలుస్తోంది.  మొత్తానికి అయితే తన సీరియల్ కెరియర్లో ఇది బిగ్గెస్ట్ అమౌంట్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: