టీవీ: గీతూ వెళ్లిపోయినప్పుడు ఏడవడానికి కారణం అదే అంటున్న బాలాదిత్య ..!

Divya
తెలుగులో బిగ్ బాస్ ఆరవ సీజన్ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. అయితే పదవ వారంలో బయటకు వచ్చిన బాలాదిత్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నాడు.. ఆయన మాట్లాడుతూ.. "సినీ ఇండస్ట్రీలో దెబ్బతిన్న వారిని చూశాను.. అందుకే కేవలం సినిమాల పైన ఆధారపడితే కష్టం.. కాబట్టి ఇతర పనుల్లో కూడా నాకంటూ కొంత నైపుణ్యాన్ని సంపాదించుకున్నాను" అంటూ తెలిపాడు. బిగ్ బాస్ కి వెళ్తే క్రేజ్ వస్తుందని వెళ్లలేదు. నేనేంటో నిరూపించుకోవడం కోసమే వెళ్లాను. బిగ్ బాస్ హౌస్లో ఎమోషన్స్ నిజంగానే ఉన్నాయి. అందుకే గీతూ వెళ్తుంటే అందరికంటే ముందుగా నేనే ఏడ్చాను. గీతూ మంచి గేమర్.. కానీ ఈమె ఎందుకు ఎలిమినేట్ అయిందో ఇప్పటికీ కూడా అర్థం కాలేదు.

అలాగే సూర్య ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో కూడా తెలియదు.  నేను ఎందుకు బయటకు వచ్చాను అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఏదేమైనా పది వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను.  మంచి పేరుతోనే బయటకు వచ్చాను.  బిగ్బాస్ నాకు చాలా నేర్పించిం.ది అంటూ చెప్పుకొచ్చాడు బాలాదిత్య. మొత్తానికి అయితే బాలాదిత్య బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఎమోషన్స్ కారణంగానే గీతూ బయటకు వెళ్లిపోయినప్పుడు ఎమోషనల్ అయినట్లుగా స్పష్టం చేశాడు. బిగ్బాస్ హౌస్ అనేది చాలామందికి ఎన్నో విషయాలను నేర్పిస్తుందని చెప్పవచ్చు.

కొంతమందికి ప్రేమను పంచితే.. మరి కొంతమందికి ఎవరితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది.. మరి కొంతమందికి ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుకుపోవాలో నేర్పిస్తుంది.  ఎమోషన్స్ , లవ్,  ఫైట్స్ , బ్రేక్ అప్ ఇలా ఎన్నో విషయాలను జబర్దస్త్ ద్వారా నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే బాలాదిత్య కూడా రేలంగి మామయ్యలా హౌస్ లో ఉన్నన్నాళ్ళు చాలా మంచిగా హౌస్ మేట్స్ తో కలిసి టాస్క్ లు పూర్తి చేశాడు ఎంత మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉన్న బాలాదిత్య ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అనే విషయం మాత్రం ఇప్పటికే మిస్టరీగానే మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: