ఆ కోరిక తీరకుండానే శ్రీమతి మెరీనా ఎలిమినేట్ ... ?

VAMSI
బిగ్ బాస్ సీజన్ 5 లో పదివారాలు పూర్తి అయిపోయి.. పదకొండవ వారం చివర్లో ఉన్నాము. ప్రస్తుతం హౌస్ లో కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. ఈ వారం అది కాస్తా 9 కి తగ్గనుంది, ఎప్పటిలాగే ఈ వారం నామినేషన్స్ లో కెప్టెన్ ఫైమా తప్ప అందరూ ఉన్నారు. కానీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో గెలిచి రాజ్ సేఫ్ అయ్యాడు. ఇక మిగిలిన 8 మందిలో రేవంత్, ఇనాయ , శ్రీహన్ లు ఎప్పటిలాగే ఓటింగ్ లో వరుసగా మొదటి మూడు స్థానాలలో ఉన్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం కీర్తి సైతం తన డేరింగ్ అండ్ డాషింగ్ గా ఆడుతూ ప్రేక్షకుల అభిమానాన్ని పొంది సేఫ్ అయినట్లు తెలుస్తోంది. ఇక మిగిలింది ఆదిరెడ్డి , రోహిత్, శ్రీసత్య మరియు మెరీనాలు.
వీరిలో ఆదిరెడ్డి మరియు శ్రీసత్య లు కూడా ఎలాగోలా ఈ వారం బ్రతికి బయటపడ్డారట. ఇక భార్యా భర్తలు రోహిత్ మరియు మెరీనా లు మాత్రమే మిగిలారు. ఇక రేవంత్, ఆదిరెడ్డి మరియు శ్రీహన్ లకు ఫీజికల్ గా గట్టి పోటీ ఇస్తున్న రోహిత్ ను అంత ఈజీగా ఎలిమినేట్ చేయరని అంతా భావిస్తున్నారు. అలా రోహిత్ శ్రీమతి మెరీనా పది వారాల తర్వాత ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వనుందని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రతి వారం లాగే ఈ వారం లీక్ లు కూడా నిజం ఈహతే మెరీనా హౌస్ నుండి వెళ్ళిపోతుంది. ఇలా జరిగితే తన కోరిక తీరకుండానే వెళ్ళిపోతున్నందుకు ఆమె చాల బాధపడే ఛాన్సెస్ ఉన్నాయి.
వచ్చే వారంలో ఈ జంటది పెళ్లి రోజు ఉందని ఈ వారంలో మెరీనా చెప్పిన విషయం తెలిసిందే. అప్పటి వరకు ఉండాలని ఆమె ఆశపడింది... అయితే ఈ వారం ఎలిమినేట్ అయితే కనుక ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోతుంది కాబట్టి ఎమోషనల్ అవుతుందంటూ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: