బిగ్ బాస్ ఓటింగ్: టాప్ లో "రేవంత్ ... ఇనాయా"లు... కానీ ?

VAMSI
తెలుగు మాటీవీ ఛానెల్ లో గత పది వారాలుగా టెలికాస్ట్ అవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో ఇప్పటికే అయిదు సీజన్ లను ఎంతో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని ప్రస్తుతం ఆరవ సీజన్ ను జరుపుకుంటోంది. అయితే మొదట్లో ఈ షో అంత ఆసక్తికరంగా లేదని కామెంట్ లు వచ్చినా తర్వాత తర్వాత బిగ్ బాస్ టీం ఎన్నో అగచాట్లు పడి షోను పైకి లేపడానికి ట్రై చేశారు. ప్రస్తుతం సగం సీజన్ పూర్తి అయింది కాబట్టి ఇంటరెస్టింగ్ గా ఉండనే చెప్పాలి. ఇక ఎప్పటిలాగే ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి మొత్తం 9 మంది నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో రేవంత్, ఇనాయ, శ్రీహన్, ఫైమా , మెరీనా, ఆది రెడ్డి, కీర్తి, వాసంతి మరియు బాలాదిత్య లు ఉన్నారు.
ఈ రోజు శనివారం కావడం వలన ఎవరు ఎలిమినేట్ కానున్నారు అన్న విషయంపై అభిమానులు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా అయితే ఎలిమినేట్ అవబోయేది వీరే అంటూ పుకార్లు స్ప్రెడ్ చేస్తున్నారు. మరికొన్ని ఛానెల్ లు అయితే ఈవారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందంటూ షాక్ లు ఇస్తున్నాయి. ఈ రోజు జరగనున్న ఎపిసోడ్ తో ఆ విషయం తెలిసిపోతుంది. అయితే ఈ వారం ఓటింగ్ లో ఎవరికీ ఎక్కువ ఓట్లు పోలయ్యాయి అన్న విషయం ఒకసారి చూస్తే, ఎప్పటిలాగే ఈవారం కూడా సింగర్ రేవంత్ మొదటి స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. వారం మధ్యలో రేవంత్ ను దాటిన లేడీ కంటెస్టెంట్ ఇనాయా సుల్తానా మల్లె రెండవ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం అనధికారిక పోలింగ్ వెబ్ సైట్స్ ప్రకారం రేవంత్ మరియు ఇనాయాలు మొదటి రెండు స్థానంలో కొనసాగుతున్నారు.
అయితే వీరిద్దరూ వ్యవహరిస్తున్న తీరు మరియు మాట్లాడే తీరు పట్ల కొందరు అభిమానులు అసహనాన్ని చూపిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ మాటలు కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా ఎబ్బెట్టుగా ఉంటున్నాయి... అయితే అతనికి అది అలవాటుగా మారిపోవడమే సమస్య అని తెలుస్తోంది. ఇనాయ సైతం అవసరం లేని చోటల్లా కలుగజేచేసుకుంటూ ఇంటి సభ్యుల దృష్టిలో చెడుగా మారిపోతోంది. మిగిలిన ఈ కొన్ని రోజులు వీరిద్దరూ అగ్రెసివ్ గా ఉండడం తగ్గించుకుని సమయస్ఫూర్తిగా ఆట ఆడితే విన్నర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఈ రోజు నాగార్జున రేవంత్ కు క్లాస్ తీసుకుంటాడు అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: