టీవీ: సుధీర్ మాటలకు కన్నీరు పెట్టుకున్న రష్మి.. కారణం..?

Divya
బుల్లితెరపై సుడిగాలి సుదీర్, రష్మీ గౌతమ్ కు ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుధీర్ ,రష్మీ జోడీకి ఈటీవీలో ఎన్నో స్పెషల్ ప్రోగ్రామ్స్ వచ్చాయి.అవన్నీ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా రష్మీ, సుధీర్ ప్రేమించుకుంటున్నరంటు పలు వార్తలు కూడా వెలుపడ్డాయి. దాదాపుగా ఎనిమిదేళ్ల పాటు వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిందని ఇక అంతే కాకుండా ఈమధ్య జబర్దస్త్ ను వదిలి కూడా సుదీర్ బయటికి వచ్చినా కూడా సుదీర్ పైన రష్మీకి ఇంత కూడా ప్రేమ తగ్గలేదని అభిమానులు భావిస్తూ ఉన్నారు.



తాజగా రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బాస్టర్ సినిమా ఈవెంట్లో మరొకసారి వీరిద్దరి మధ్య ప్రేమ బయటపడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్లో సుధీర్ అక్కడికి గెస్ట్ గా రావడం జరిగింది. ఇక సుధీర్ మాట్లాడుతూ తన కెరీర్లు రష్మీ లేకపోతే తనకి ఇంత పేరు, అందం వచ్చేది కాదని తెలియజేశారు. ఆమె వల్లే తనకు ఇంత పేరు వచ్చిందని డైరెక్టుగా తెలియజేశారు. ఒకపక్క సుధీర్ స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే రష్మీ కంటి నుండి నీళ్లు రావడం తో అక్కడున్న వారందరిని కదిలించిందని చెప్పవచ్చు.


ఇక సుధీర్ మీద ఉన్న అభిమానాన్ని రష్మి ఇలా తెలియజేసింది అంటు పలు వార్తలు వినిపిస్తున్నాయి. సుధీర్ మల్లెమాల నుంచి బయటకు వెళ్ళింది అక్కడ ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారని గతంలో కూడా ఆటో రాంప్రసాద్ తెలిపారు. అయితే ఏ మాత్రం ఛాన్స్ దొరికినా కూడా సుదీర్ ప్రస్తుతం జబర్దస్త్ లోకి తీసుకువచ్చేందుకు పలు సన్నహాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఒక్కసారి జబర్దస్త్ను కాదని వెళ్ళిన తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడం అంటే అంత సులువు కాదని చెప్పవచ్చు. జబర్దస్త్ చేయకపోయినప్పటికీ సుధీర్ రష్మీ ల మధ్య రిలేషన్ అలాగే కొనసాగుతోందని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: