సింగర్ రేవంత్ పై గీతక్క కు ఎందుకంత "కక్ష" ?
ఇప్పటి వరకు ఆడింది ఒకలా ఇప్పుడు ఆడుతోంది మరోలా అన్నట్లు వారి గేమ్ ఉంది. కానీ గీతు రాయల్ మాత్రం ఆటను మాత్రం గాలికి వదిలేసి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేద్దామా ? ఎవరి ఆటను చెడగొడదామా ? నచ్చనివారిని ఎలా రెచ్చగొడదామా అంటూ కాచుకు కూర్చుని ఉంటుంది. అందులో భాగంగా ఈ చేపల టాస్క్ లో కూడా జంటగా ఉన్న గీతు మరియు ఆది రెడ్డి లు సక్సెస్ ఫుల్ గా ఫెయిల్ అయ్యారు. అందరికన్నా తక్కువ చేపలు ఉన్న కారణంగా బిగ్ బాస్ వీరిని ఆటనుండి తొలగించడం జరిగింది. ఇక ఈ టాస్క్ లో అన్ని రౌండ్ లను అద్భుతంగా ఆడి మొదటి స్థానంలో నిలిచారు రేవంత్ మరియు ఇనాయ ల జంట. కానీ చివర్లో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ తో రేవంత్ మొదటి స్థానాన్ని కోల్పోయాడు.
అసలు ఏమి జరిగింది అంటే... సెకండ్ రౌండ్ ముగిసిన తర్వాత అందరికన్నా ఎక్కువ చేపలు రేవంత్ ఇనాయా ల దగ్గర ఉన్నాయి. కానీ టాస్క్ లో భాగంగా అన్ని చేపలతో పాటుగా అందులో ఒక బ్లాక్ చేప వచ్చింది. ఆ చేప ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు రెండు చేపల బాస్కెట్ లను మార్చడానికి అర్హతను పొందుతారు. ఆ బ్లాక్ చేప గీతు కు దొరికి ఉంటుంది, దొరికింది కదా అవకాశం అనుకుని టాప్ లో ఉన్న రేవంత్ జంట తో శ్రీహన్ వారిని స్వాప్ చేస్తుంది.. అయితే ఈమె చేయకముందే అందరూ రేవంత్ ను స్వాప్ చేస్తారని ఊహించారు. ఇందుకు కారణం మొదటి నుండి కూడా గీతు కు రేవంత్ కు పాడడం లేదు. వీరిద్దరి మధ్యన ఎన్నో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. కానీ అవన్నీ మనసులో పెట్టుకుని గీతు ఇలా చేయడం రేవంత్ ఫ్యాన్ ను చాలా బాధకు గురి చేసింది. ఇలా చెత్త చెత్త కామెంట్స్ మరియు చెత్త విధానాలతో గీతు రాయల్ ఆట రోజు రోజుకి తీసికట్టుగా మారుతోంది.