బిగ్ బాస్ 6: గీతు మారిపోయింది... నిజమేనా ? స్ట్రాటజీనా ?

VAMSI
బిగ్ బాస్ సీజన్ 6 లో ఇప్పటికే ఆరుగురు హౌజ్ లో సరిగా ఆడక ప్రేక్షకుల ఆగ్రహానికి గురయ్యి ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. అందులో శానీ, అభినయ శ్రీ, నేహా, ఆరోహి, చంటి మరియు సుదీప లు ఉన్నారు. మొత్తం 21 మంది హౌజ్ లోకి అడుగు పెట్టగా ప్రస్తుతం 15 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మిగిలిన ఇంటి సభ్యుల మధ్యన పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా హౌజ్ లోకి వచ్చిన క్షణం నుండి ఒక్క ఇంటి సభ్యురాలు మాత్రం తనలాగే ఉంటూ వచ్చింది. దాదాపుగా లాస్ట్ వీక్ వరకు అలాగే ఉంది. కానీ నిన్న రాత్రి సుధీప ఎలిమినేట్ అయ్యి నాగార్జున దగ్గర ఉండగా... సదరు సభ్యురాలు ఓపెన్ అయ్యి "అక్క నేను నీ మీద అసూయపడి ఎన్నో తిట్టుకున్నాను.. సారీ అని చెప్పేసింది.
ఈ సంఘటనతో ఇంటి సభ్యులు, హోస్ట్ నాగార్జున, సుధీప మరియు ప్రేక్షకులు షాక్ కు గురయ్యారు. ఈ మాట ఇంకెవరైనా అని ఉంటే అంత షాక్ అవ్వరు.. కానీ మనుషులు అంటేనే అటాచ్మెంట్ లేని, రిలేషన్ లు పెట్టుకోను అని ఫస్ట్ నుండే తెగేసి చెబుతున్న అమ్మాయి గీతు రాయల్. మొదటి నుండి అందరితోనూ కటువుగా ప్రవర్తిస్తూ కొందరికే తను పరిమితం అన్నట్లు తన వ్యవహరం సాగింది. కానీ హౌజ్ లో తన ప్రయాణం సాగుతున్న కొద్దీ రిలేషన్ లు , మనుషులు ఎంత ముఖ్యం అన్నది తెలిసి వచ్చింది. అందుకే గీతులో ఇంత మార్పు వచ్చింది. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గీతక్క ఎంటి సారీ చెప్పడం ? గీతక్క బాధపడడం ఏంటి అంటూ బయట చర్చలు జరుగుతున్నాయి. ఏదైతే ఏమి గీతు కూడా అందరితో కలవడానికి సిద్దంగా ఉంది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉందంటూ కొందరు భావిస్తున్నారు. మనుషులతో ఆడుకోవడం గీతుకు యూ ట్యూబ్ తో పెట్టిన విద్య... ఇది ఆటలో ఒక స్ట్రాటజీనా అంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నా వారు లేకపోలేదు. మరి గీతు నిజంగానే మారిందా లేక స్ట్రాటజీ అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజుల వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: