టీవీ:ఇండస్ట్రీలో కమిట్మెంట్ గురించి ఓపెన్ అయిన బిగ్ బాస్ దివి..!!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉందనే వార్త వినిపిస్తూనే ఉన్నది. ఈ విషయాన్ని ఎంతోమంది నటీమణులు సైతం బహిరంగంగా చెప్పిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా అవకాశాల కోసం ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇదివరకు ఎంతో మంది హీరోయిన్స్ సైతం ఇలాంటి ఇబ్బందుల గురించి తెలియజేశారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా గుర్తింపు పొందిన దీవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అందులో ఇండస్ట్రీలో ఉన్నటువంటి కమిట్మెంట్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బిగ్ బాస్ దీవి కెరియర్ మొదట్లో మోడలింగ్ రంగం నుంచి అడుగు పెట్టింది.ఆ తర్వాత ఎన్నో వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ఈ క్రమంలోనే తాను మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి సిని రంగంలోకి కొనసాగుతున్న సమయంలో కమిట్మెంట్ గురించి ఏమాత్రం తెలియదని తెలియజేస్తోంది. కమిట్మెంట్ అనేది మాత్రం మన బిహేవియర్ ని బట్టి ఉంటుంది అని తెలియజేసింది. ఒకవేళ ఇద్దరు ఇష్టపడి ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే అది తన దృష్టిలో తప్పు కాదని తెలియజేసింది.
కేవలం కమిట్మెంట్ విషయంలో ఇద్దరిలో ఏ ఒక్కరు ఇష్టం లేకుండా అది బలవంతం చేస్తే చాలా పెద్ద తప్పు అని తెలియజేసింది. ఇండస్ట్రీలో ఇలాంటి కమిట్మెంట్స్ ఇబ్బందులను ఎంతోమంది ఎదుర్కొన్నారు అయితే ఈనెల కెరియర్లో తనను ఎవరు ఇలాంటి కమిట్మెంట్ అడగలేదని తెలియజేసింది. ఇక తన కెరీర్ విషయానికి వస్తే తనకు ఇండస్ట్రీలో అవకాశాల కోసం పెద్దపెద్ద బ్యానర్ లో అవకాశం వచ్చిన ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నటిస్తానని తెలియజేసింది దివి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాట్లాడిన మాటలు మాత్రం చాలా వైరల్ గా మారుతున్నాయి.