టీవీ: సింగర్ మంగ్లీ ఒక్కో పాటకి తీసుకొనే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
ఆ తర్వాత ఎన్నో సరికొత్త చానల్స్ వారు ఈమెలో ఉన్న గాయనిని ప్రేక్షకులకు పరిచయం చేయడం జరిగింది. ఆ తర్వాత మంగ్లీ కి సింగర్ గా జాయిన్ అయినా సమయంలో మొదట రూ.10 వేల రూపాయలు జీతం గా ఇచ్చేవారట. అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది అభిమానుల సైతం సంపాదించుకుంది. తన గొంతుతో తన బాడి లాంగ్వేజ్ తో ప్రతి ఒక్కరికి ఉత్సాహాన్ని ఇచ్చే పాటలు పాడి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది సింగర్ మంగ్లీ. ఇక అందుకు తోడు ఆమె ఒక్కొక్కటిగా సక్సెస్ అందుకుంటూ ఎన్నో చిత్రాలలో కూడా ఈమె పాటలు పాడుతూ వచ్చింది. ఇక దీంతో హీరోయిన్ రేంజ్ కు ఈమె పేరు పాపులర్ అయ్యిందని చెప్పవచ్చు..
స్టార్ హీరోల సినిమాలలో పాటలు పాడి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దాదాపుగా ఈమె ఒక్కో పాటకి ప్రస్తుతం రూ.5 లక్షల రూపాయలు తీసుకుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్న అంటే చాలు రెమ్యూనరేషన్ అధికంగానే తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మంగ్లీ కి సంబంధించి ఏదైనా ఒక వీడియో పోస్ట్ చేసిందంటే చాలు లక్షలలో వ్యూస్ రాపడుతూ ఉంటాయి. ఇక వీటి ద్వారా కూడా దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు ఆదాయాన్ని సంపాదిస్తున్నట్లుగా సమాచారం. ఇక సింగర్ మంగ్లీని చూసి ఎంతోమంది ఆమె లాగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.