టీవీ: జబర్దస్త్ జడ్జ్ కృష్ణ భగవాన్ యొక్క పారితోషికం ఎంతంటే..?
ఈ మేరకు కృష్ణ భగవాన్ రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది అనే అంశం చర్చినియంశంగా మారుతోంది. అయితే మల్లెమాల మరియు కృష్ణ భగవాన్ సన్నిహితుల సమాచారం ప్రకారం కృష్ణ భగవాన్ కు ఒక్కో ఎపిసోడ్ కు రూ.1.5 లక్షలు ఇస్తున్నట్లు సమాచారం. ఇక జడ్జిగా ఇంద్రజాకు మాత్రం రూ.2.5 లక్షలు ఇస్తున్నట్లు సమాచారం. ఇక కృష్ణ భగవాన్ గతంలో ఎన్నో సినిమాలలో నటించి మంచి కమెడియన్ గా కూడా పేర్కొన్నారు ఇప్పుడు మళ్లీ తాజాగా బుల్లితెరపై అంతే కామెడీని పంచుతూ అభిమానులను సైతం చాలా సంతోష పరుస్తూ ఉన్నారు.
అయితే ఈ మధ్యకాలంలో అంతగా సినిమాలలో కనిపించలేదు కృష్ణ భగవాన్. అల్లరి నరేష్ ,కృష్ణ భగవాన్ కలిసి ఎన్నో సినిమాలలో నటించారు.వీరిద్దరూ చేసే కామెడీ సినిమాలు బుల్లితెరపై ప్రసారమయ్యాయి అంటే చాలు ఇప్పటికీ ప్రేక్షకులు సైతం కడుపుబ్బ నవ్వుతూ ఉంటారని చెప్పవచ్చు. అంతేకాకుండా దర్శకులు, రచయితలకు కథలు కూడా రాసి ఇచ్చేవారట కృష్ణ భగవాన్. అయితే ప్రస్తుతం ఉన్న హీరోలకు మాత్రం కథలు రాయలేకపోవడంతో సినిమా ఆఫర్లు రాలేకపోవడంతో బుల్లితెర పైన సందడి చేస్తున్నట్టుగా సమాచారం కృష్ణ భగవాన్. మరి కృష్ణ భగవాన్ ఎంతవరకు జబర్దస్త్ లో ఉంటారు చూడాలి మరి.