టీవీ: చిరంజీవి సినిమాలో అలా నటించమంటే రిజెక్ట్ చేసానంటున్న నటి..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో ఎన్నో సీరియల్స్ లో నటించింది నటి మాధవి రెడ్డి. అలా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె స్టార్ హీరోల సినిమాలో కూడా నటించింది. ఈమె కెరియర్ ప్రారంభంలో ఆర్.నారాయణమూర్తి హీరోగా నటించిన మార్కెట్లో ప్రజాస్వామ్యం అనే చిత్రంలో కూడా ఈమె హీరోయిన్గా నటించినట్లు తెలుస్తోంది. ఇక యువ హీరోలతో మాత్రం మజిలీ, వకీల్ సాబ్ వంటి చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా మాధవి రెడ్డి తన సినీ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది వాటి గురించి చూద్దాం.

తన కెరియర్ మొదట్లో ఈమెకు రెండు సినిమాలలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చిందట. కానీ ఈమె హీరోయిన్గా అయితే నటించనని కేవలం తల్లిపాత్రలలోనే మాత్రమే చేస్తానని.. అలాంటి పాత్రలోనే నటించేందుకు ఈమె ఫిక్స్ అయ్యిందట.. అయితే కేవలం తల్లి పాత్రలోనే నటించడానికి గల కారణం ఏమిటంటే తనకి కూడా ఒక కుటుంబం ఉందని కొన్ని పరిమితులు కూడా పెట్టుకున్నానని నేను ఏదైనా సినిమాలో నటిస్తే ఆ సినిమాలోని పాత్ర వల్ల తన కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అందుచేతనే హీరోయిన్గా కాకుండా కేవలం అమ్మ పాత్రలలోనే నటించానని తెలియజేసింది.

ఒకవేళ షూటింగ్ కు వెళ్లాక తనకు ఏదైనా పాత్ర నచ్చకపోతే ఏమాత్రం మొహమాటం పడకుండా నటించనని కరాకండిగా చెప్పేస్తుందట. అలా ఒకసారి తనకేరియర్లో చిరంజీవి గారి సినిమాలో నటించే అవకాశం వచ్చిందట షూటింగ్ చెట్టుకు వెళ్లాక అక్కడ చిరంజీవి ముందు.. పైట జారుకునే సన్నివేశం ఉందని చెప్పారు చిత్ర బృందం. కానీ ఆ విషయం తనకి షూటింగ్ ముందు వరకు చెప్పలేదట సెట్లోకి వెళ్ళాక అలా చెప్పడంతో ఆ పాత్ర చేయాలని చెప్పి వెను తిరిగి వచ్చేసానని తెలిపింది. సినిమాలో ఎక్స్పోజింగ్ వంటివి తనకు నచ్చదు అని.. అందుచేతనే నేను తల్లి పాత్రలలో మాత్రమే నటిస్తానని మాధవి రెడ్డి తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: