టీవీ: మొదటిసారి కెవ్వు కార్తీక్ చేసిన పనికి సీరియస్ అయిన ఇంద్రజ..!!

Divya
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ షో చూడని వారు అంటూ ఎవరు ఉండరని చెప్పవచ్చు. ఈ షో కోసం ఎంతోమంది ప్రేక్షకులకు సైతం ఇప్పటికి ఎదురు చూస్తూనే ఉంటారు అయితే ఇందులో హైపర్ ఆది, సుడిగాలి సుదీర్ ఇతర కంటెస్టెంట్లు కోసం ప్రేక్షకులు ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈమధ్య సుడిగాలి సుదీర్ జబర్దస్త్ నుంచి బయటికి వెళ్లిపోయారు. దీంతో రేటింగ్ కాస్త తగ్గిందని చెప్పవచ్చు.. ఈ షో కి ఉన్న క్రేజ్ అలాంటిది అని చెప్పవచ్చు.

అయితే కొద్దిరోజులు గ్యాప్ తర్వాత తిరిగి గెటప్ శీను తిరిగి వచ్చారు ఇక అక్కడ నుంచి ఈ షో కాస్త స్థిరంగా రేటింగ్ విషయంలో ఉన్నట్లు సమాచారం. దీంతో మరికొంతమంది సుదీర్ రావాలంటే అభిమానుల సైతం కోరుకుంటూ ఉన్నారు. అయితే ఇందులో జడ్జిలుగా ఉన్న రోజా, మనో కొన్ని కారణాల చేత ఈ షో నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఇక తర్వాత రోజా ప్లేస్ లో ఇంద్రజ రావడం జరిగింది. ఇక ఇంద్రజ తో పాటు అలనాటి హీరోయిన్ కుష్బూ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నది. తాజాగా జబర్దస్త్ నుంచి ఒక ప్రోమో విడుదల అయింది.
ఈ ప్రోమోలో ఇంద్రజ కెవ్వు కార్తీక్ పైన సీరియస్ అయినట్లుగా కనిపిస్తోంది. కార్తీక్ జడ్జిల వల్ల టీం లీడర్స్ పడుతున్న బాధల గురించి స్కిట్ చేయడం జరిగింది. దీన్ని చూసిన ఇంద్రజ జడ్జిమెంట్ ఇవ్వకుండా.. టీం లీడర్ల వల్ల జడ్జిలు కూడా ఎలా బాధపడుతున్నారో స్కిట్ చేసి చూపించండి అంటూ తెలియజేసింది.. దీంతో అప్పుడు ఈ రెండిటికీ జడ్జ్మెంట్ ఇస్తాను అని అక్కడి నుంచి లేచి వెళ్లిపోవడం ఈ ప్రోమోలో చూడవచ్చు. ఇక తరువాత ఏం జరిగింది అనే విషయంపై ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: