టీవీ: పెళ్లి పీటలు లేకపోతున్న జబర్దస్త్ ప్రియాంక..!!

Divya
బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ షో లో ఎంతోమంది కమెడియన్ , కంటెస్టెంట్స్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక అంతే కాకుండా ఇందులో లేడీ గెటప్పులతో కూడా ఎంతోమంది ప్రేక్షకుల ఆదరణ పొందిన వారు ఉన్నారు. ఇక అలా పాపులర్ అయిన వారిలో సాయి తేజ ఒకరిని చెప్పవచ్చు. ఇక తర్వాత ఇతను ప్రియాంక సింగ్ గా మారారు. ఇక బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని ఐదో సీజన్ లో పాల్గొన్నది ప్రియాంక సింగ్. ఇక బిగ్ బాస్ లో మానస్ తో ప్రేమ వ్యవహారం నడిపి అక్కడ బాగా హైలైట్ గా నిలిచింది. ఇక గతంలో బిగ్ బాస్ లో పాల్గొన్న తమన్న సింహాద్రి లాగా ఈమె వ్యవహరిస్తుందని అందరూ భావించారు . అందుకు భిన్నంగా ప్రియాంక బిగ్ బాస్ లో వ్యవహరించి అభిమానులకు మరింత దగ్గరయింది.
ఇక సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే తాజాగా ప్రియాంక తన హల్దీ ఫొటోస్ ని పంచుకొని ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. ఇందులో ప్రియాంక ఒక పెళ్లి కూతుర్ లా చాలా ముస్తాబయినట్లుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసిన వారు సైతం త్వరలోనే ప్రియాంక వివాహం చేసుకోబోతోందా అంటూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఏమైనా ఫోటోషూట్ లేక నిజంగానే ఈమె వివాహం చేసుకుంటోందా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ప్రియాంక తన చిన్న తనం నుండి తన తండ్రి తనను వ్యతిరేకించడంతో చాలా కష్టపడి ఈ రంగంలోకి అడుగు పెట్టింది. ఇక లింగ మార్పిడి సర్జరీ అనారోగ్య సమస్యలు.. వంటివి ఆమెను ఇబ్బంది పెట్టాయట. అలా సాయి తేజ నుండి ప్రియాంక సింగ్ వరకు మారింది. ప్రస్తుతం ప్రియాంక సింగ్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: