టీవీ: ఈటీవీలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చినా సుదీర్ చమ్మక్ చంద్ర..!!

Divya
బుల్లితెరపై సుడిగాలి సుదీర్ చమ్మక్ చంద్ర పేర్లు తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇక ఈటీవీలో మల్లెమాల చేసేటువంటి షో లలో జబర్దస్త్ వంటి వాటితో మంచి పాపులారిటి సంపాదించుకున్నారు. ఇక మధ్యలో కొన్ని కారణాల వల్ల పక్క ఛానల్ లకు వెళ్లిన వీరు.. బుల్లితెరపై,వెండితెరపై బాగా పాపులారిటీ సంపాదించారు. ఇక చమ్మక్ చంద్ర నాగబాబుతో కలిసి అదిరింది బొమ్మ అదిరింది అనే షో లో నటించారు. ఇప్పుడు తాజాగా కామెడీ స్టార్స్ అనే షో లో కూడా నటిస్తూ ఉన్నారు. ఇక సుడిగాలి సుదీర్ కూడా ఈ మధ్య స్టార్ మాలోకి వెళ్లిపోయాడు.

మల్లెమాల ఈటీవీతో ఏం జరిగిందో తెలియదు గానీ సుధీర్ కూడా అందులో నుంచి బయటికి వెళ్లారు.. అయితే కొంతమంది మాత్రం రెమ్యూనరేషన్ కోసం బయటికి వచ్చారని వార్తలు కూడా వినిపించాయి. ఈ విషయంపై సుదీర్ ఎప్పుడూ కూడా స్పందించలేదు. అయితే మరి కొందరు మాత్రం జబర్దస్త్ లో అవమానాలు మల్లెమాలలు సరైన గుర్తింపు లేకపోవడం వల్లే సుదీర్ బయటికి వచ్చాడని టాక్ కూడా ఎక్కువగా వినిపిస్తోంది.

అయితే సుదీరి ఇక పైనా ఎప్పటికీ మల్లెమాలో కూడా అడుగుపెట్టడని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈటీవీలో ఈవెంట్లో కనిపించడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ఇక సుధీర్ తో పాటు చమ్మక్ చంద్ర కూడా ఇందులో పాల్గొనడంతో చమ్మక్ చంద్ర అభిమానులు కూడా షాక్ అయ్యారు. అయితే ఇదంతా ఎవరు ప్లానింగ్ అన్నది మాత్రం తెలియడం లేదు.. సుదీర్, చమ్మక్ చంద్ర ఈటీవీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది అది కూడా ఈటీవీ మీదున్న ప్రేమతో అన్నట్లుగా సమాచారం. ఈటీవీ 27వ వార్షికోత్సవం ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు మల్లెమాల. ఇక భలే మంచి రోజు అంటూ రాబోతున్న ఈవెంట్ సుదీర్ చమ్మక్ చంద్ర కనిపించడం జరిగింది ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: