టీవీ: రోజా సెల్వమణి 11ఏళ్ల ప్రేమ గురించి తెలియని విషయాలు ఇవే..!!

Divya

హీరోయిన్ రోజా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. ఈమె అసలు పేరు శ్రీలతా రెడ్డి. ఈమె 1972 నవంబర్ 17న నాగరాజు రెడ్డి, లలిత దంపతులకు జన్మించింది. రోజా చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించింది. రోజా సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వకముందు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో బాగా అలరించేది. ఇక హీరోయిన్గా నటించిన మొదటి చిత్రం ప్రేమ తపస్సు.. ఈ సినిమాని దిగవంగత నటుడు మాజీ ఎంపీ శివప్రసాద్ దర్శకత్వం చేశారు ఇక ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లు శోభన్ బాబు హీరోగా సర్పయాగం అనే సినిమాలో రోజా శోభన్ బాబు కూతురు పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా సక్సెస్ అవడంతో ఇమే కెరియర్ పరంగా వేను తిరిగి చూడలేదు.

సినిమాలలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రోజా ఇక ఆ తర్వాత బుల్లితెర పై పలు షో లకు జడ్జిగా కూడా వ్యవహరించినది. ఇక తాజాగా మంత్రిగా కూడా ప్రమోషన్ అందుకున్నది దీంతో ఇమే వెండితెర ,బుల్లితెర వైపు కూడా దూరంగా ఉన్నది. ఇక ప్రముఖ తమిళ డైరెక్టర్ ఆర్కే సెల్వమనిని ప్రేమించి వివాహం చేసుకున్నది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వీరి వివాహం అంత సులువుగా ఏమీ జరగలేదట.

ఇక రోజా చెంబురతి అనే సినిమాతో కోలీవుడ్ లోకి అడుగు పెట్టినది. ఈ సినిమాని డైరెక్టర్ సెల్వమణి తెరకెక్కించారు. ఇక ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడక ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇక వీరిద్దరి పెళ్లి చేసుకునేందుకు 11 ఏళ్ళు సమయం పట్టిందట. తాను హీరోయిన్ అవ్వడం కోసం రోజా తన అన్నదమ్ముల కెరీర్ ను కూడా వదిలిపెట్టి సినిమాలలో నటించింది. ఇక ఈ సినిమాతో వారందరి కెరియర్ సెటిల్ చేయాలని భావించింది రోజా. అలాంటి సమయంలోనే సమరం అనే చిత్రాన్ని తెలుగు మరియు తమిళ భాషలలో ఒకేసారి తెరకెక్కించింది. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఇక ఈ సినిమా సమయంలో ఎన్నోసార్లు గాయపడడమే కాకుండా ఈ సినిమా తర్వాత నష్టాలలో కోరుకుపోయింది ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడింది. అందుచేతనే చివరికి 2002లో వివాహం చేసుకున్నారు రోజా సెల్వమణి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: