టీవీ: కామెడీ స్టార్ లో అనసూయ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Divya
గత నాలుగైదు వారాల నుండి అనసూయ జబర్దస్త్ విడిచి వెళ్లిపోతోంది అని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. జబర్దస్త్ ని వీడి స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్ లో ఈమె జాయిన్ అయిందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే అనసూయ అభిమానులు మాత్రం జబర్దస్త్ లో చేస్తూ స్టార్ మా లో కూడా యాంకర్ గా కనిపించబోతుంది అని నమ్మకాన్ని పెట్టుకున్నారు కానీ తాజాగా ఆమె జబర్దస్త్ వీడినట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక అంతేకాకుండా వచ్చేవారం జబర్దస్త్ కొత్త యాంకర్ కూడా రాబోతుందని ప్రోమోలో విడుదల చేయడం జరిగింది.
. ఈ సమయంలోనే అనసూయ జబర్దస్త్ లో మానివేయడానికి గల కారణం ఏమిటా అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. అయితే కొంతమంది దగ్గర అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ లో తక్కువ పారితోషకం ఇస్తున్న కారణంగానే ఈమె జబర్దస్త్ విడిపోయింది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ లో అనసూయ ఒక్కరోజు పని చేస్తే రూ.2.5లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకునేది కానీ ఇప్పుడు స్టార్ మాలో మాత్రం అనసూయ చేస్తున్న ఒక ఎపిసోడ్ కి రూ.4 లక్షలు ఇవ్వబోతున్నట్లు సమాచారం.

ఇక అంతే కాకుండా అనసూయ డేట్లు విషయంలో కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లుగా కూడా సమాచారం . ఆమెకు ఇష్టమైన సమయంలోనే వచ్చి అషో లో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది అందుచేతనే అనసూయ ఈ కార్యక్రమానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తున్నది పారితోషకం కూడా భారీగా పెరగడంతో సమయం కూడా తక్కువగా అడగడం వల్ల అనసూయ జబర్దస్త్ స్టార్ మాలోకి వెళ్ళింది అన్నట్టుగా తెలుస్తోంది మొత్తానికి జబర్దస్త్ నుండి కేవలం అనసూయ డబ్బు కోసమే మారింది అంటూ ఆమె అభిమానులు సైతం బలంగా సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. అయితే అసలు విషయం ఏమిటనేది మాత్రం అనసూయని క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతం అనసూయ పలు సినిమాలలో బిజీగా ఉండి జబర్దస్త్ ను వీడినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది మరి ఈ విషయంలో ఏది నిజం తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: