టీవి:జబర్దస్త్ నుంచి బయటికి రావడానికి కారణం అదే అంటున్న సత్య శ్రీ..!!

Divya
జబర్దస్త్ కామెడీ షో లో మొదటి నుంచి ఎక్కువగా లేడీ గెటప్స్ ల హావ బాగానే కొనసాగేది. అందులో ముఖ్యంగా వినోద్, పవన్, తేజ , శాంతి తదితరులు జబర్దస్త్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . కానీ ఒక్కసారిగా జబర్దస్త్ లోకి లేడీ కమెడియన్ లు ఎంట్రీ ఇవ్వడంతో ఈ జబర్దస్త్ షో మరింత గుర్తింపు తెచ్చుకుంది. అలా ఎంట్రీ ఇచ్చిన లేడీ కమెడియన్లలో సత్య శ్రీ కూడా ఒకరు. అయితే జబర్దస్త్ నుండి సత్య శ్రీ బయటికి రావడానికి గల కారణం తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది వాటి గురించి చూద్దాం.

జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర, తన సహనటుడు వినోద్ కు మంచి జోడీగా ఉండేది. కానీ వినోద్ వెళ్లిపోయిన తర్వాత చమ్మక్ చంద్ర టీం లోకి సత్య శ్రీ రావడం జరిగింది. ఇక వీరిద్దరు కూడా బాగానే రాణిస్తూ ఉండేవారు. ఎక్కువగా ఫ్యామిలీ స్కిట్లనే చేసేవారు చమ్మక్ చంద్ర. ఇక జబర్దస్త్ షోను నాగబాబు వీడినప్పుడు చంద్రా కూడా ఆయనతో పాటు వెళ్లిపోయారు. ఇక ఆ సమయంలోనే సత్య శ్రీ కూడా జబర్దస్త్ నుంచి బయటికి వెళ్లిపోవడం జరిగింది. అందుచేతనే జబర్దస్త్ నుంచి బయటికి వచ్చాను అని తెలియజేసింది.

తనకి గురువు అయిన చమ్మక్ చంద్ర గారు అక్కడ లేకపోవడం వల్లే జబర్దస్త్ ను వీడి.. తమ మొత్తం టీం కూడా బయటికి వచ్చామని తెలియజేసింది. ఆ తర్వాత అదిరింది ఇప్పుడు కామెడీ నైట్ వంటి షోలో చేస్తున్నానని తెలియజేసింది. ప్రస్తుతం చమ్మక్ చంద్ర సినిమాలో బిజీగా ఉండడం వల్ల ధనరాజ్ టీమ్లో చేస్తున్నట్లుగా తెలియజేసింది. ఇక తనతోపాటు ఎంతో మంది కూడా జబర్దస్త్ ను వీడడం జరిగింది. కానీ వారందరికీ పలు కారణాలు కూడా ఉన్నాయని తెలియజేసింది. కానీ ప్రతి ఒక్కరికి లైఫ్ ఇచ్చింది మాత్రం జబర్దస్త్ అని తెలియజేసింది సత్య శ్రీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: