సొంత వారినే బ్లాక్ మెయిల్ చేసి జబర్దస్త్ కి వచ్చిన లేడీ ఆర్టిస్ట్?

VAMSI
బుల్లితెరపై ఈటీవీ ఛానెల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అన్న విషయం తెలిసిందే. ఈ షో కి లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఈ షో లో వచ్చే సెలబ్రిటీలు కూడా అంతే పాపులర్. ఈ షోలో చాలా మంది తమ పాపులారిటీ ని పెంచుకుని సినిమాల లోను బాగా బిజీ అయిపోయారు. జబర్దస్త్ కు ముందు సినిమాలలో నటించినా రాని గుర్తింపు ఈ షోలోకి వచ్చాక పాపులర్ అయిన ఆర్టిస్టులు కూడా చాలామందే ఉన్నారు.  అయితే ఇలాంటి ఫ్లాట్ ఫామ్ లలో అవకాశం అందటం అంటే అందరికీ అంత సులభం కాదు. మరి అలాంటి అద్భుతమైన అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా ? అందుకే జబర్దస్త్ లాంటి షో లో తనకి అవకాశం వస్తే ఇంట్లో వాళ్ళు వద్దన్నా బ్లాక్మెయిల్ చేసి మరీ జబర్దస్త్ స్టేజ్ ఎక్కేసింది ఓ ఆర్టిస్ట్.
దైర్యం చేసి రావడమే కాదు అందరి చేత భళా అనిపించుకునేలా గుర్తింపు పొందింది. వద్దన్న కుటుంబ సభ్యులు నేడు ఆ ఆర్టిస్ట్ మా అమ్మాయి అని గర్వంగా చెప్పుకునేలా మారింది. ఇంతకీ ఆమె మరెవరో కాదు ఫాహిమా . పటాస్ షో తో ఈమె ప్రయాణం మొదలయ్యింది. ఆ షో లో ఒక ప్రేక్షకురాలిగా వచ్చిన సైమా తన స్వరం , అలాగే స్లాంగ్ తో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఇక అలా అక్కడ నుండి ఏకంగా బిగ్గెస్ట్ తెలుగు కామెడీ షో జబర్దస్త్ లో అవకాశం అందుకుంది. అయితే ఈ షో కి వెళ్ళడానికి మొదట ఇంట్లో వాళ్ళు అస్సలు వద్దన్నారట అయినా ఆమె వినకుండా వారిని బ్లాక్మెయిల్ చేసి మరీ షోకి వచ్చింది.
అలా వచ్చిన ఫాహిమా  తన ప్రతిభతో ఇపుడు ఎంత పాపులర్ అయ్యిందో  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె స్కిట్ లు చూసినా ఎవరైనా తనకు అభిమాని అయిపోవాల్సిందే. అంతమంది మగ ఆర్టిస్ట్ ల ముందు వారికీ ఏమాత్రం తీసిపోని రీతిలో తన ప్రదర్శన తో ఆకట్టుకుంటూ ఉంది ఫాహిమా .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: