బిగ్ బాస్ కి ధమ్కీ ఇచ్చిన హర్ష సాయి... షాక్ లో ఫ్యాన్స్?

VAMSI
హర్ష సాయి..ఈ పేరు చెప్పగానే అందరికి గుర్తుకొచ్చేది ముఖ్యంగా సోసిల్ మీడియా అని చెప్పవచ్చు. ఎందుకు అంటే ప్రస్తుతం యూట్యూబ్ లో , ఫేస్ బుక్ లో ఇలా ఎక్కడ చూసినా కూడా యూట్యూబ్ హర్ష సాయి పేరు మార్మోగిపోతోంది.  అయితే రియల్ లైఫ్ శ్రీమంతుడు గా గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబ్ ద్వారా హర్ష సాయి కి 4.99 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక పోతే ప్రస్తుతం చాలా మంది యూట్యూబ్ లో డబ్బులు కోసం మాత్రమే వీడియోలు చేస్తుంటే హర్ష సాయి మాత్రం ఏ వీడియో పోస్ట్ చేసినా అందులో ప్రజలకు ఏదో ఒక రకంగా సేవ చేయడమే ప్రధాన అంశంగా పెట్టుకున్నాడు. అయితే దానికి తగ్గట్టుగానే అతను వీడియోలు చేస్తున్నాడు. కానీ సాయం అంటే ఏదో వందో వెయ్యో కాదు.. వాళ్ళ అవసరాన్ని బట్టి లక్షల్లో కూడా సాయం చేస్తుంటాడు.
అలాగే పేదవాళ్లు ఊహించని రీతిలో సాయం చేసి దానకర్ణుడిగా కూడా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఇప్పటికే చాలా వందల మంది ఫ్యామీలీస్‌కి సాయం చేసిన సాయి త్వరలో మరో 1 మిలియిన్ డబ్బుని పేదలకు దానం చేయబోతున్నట్టు తెలిసింది. అయితే ఆ డబ్బుతో వంద మంది పేద ఇళ్లకు సాయం చేయబోతున్నట్టు తెలిపాడు. అలాగే ఇంకెవరికైనా ఎవరికైనా తన సాయం కావాలనిపిస్తే 09502600756 ఈ నెంబర్‌కి తప్పకుండా  కాల్ చేయొచ్చని చెప్పాడు . కాగా హర్ష సాయి త్వరలో బుల్లితెరపై ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ రాబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. కాగా ఇటీవల కాలంలో బిగ్ బాస్ సీజన్ 6 లోగో లాంచ్ ప్రోమో విడుదల కాగా..ఇందులో హర్ష సాయి గురించే చర్చ నడిచింది.
అంతేకాదు అన్న కోసం వెయిటింగ్ అంటూ చాలా మంది ఫ్యాన్స్ కామెంట్లు కూడా పెట్టగా.. మరికొందరు మాత్రం సాయి ఇలాంటి చిల్లర షోలకు రాడు.. అలాగే దయచేసి బిగ్ బాస్ షోకి మాత్రం రావొద్దన్నా.. మీ స్థాయిని దిగజార్చుకోవద్దు అంటూ అతని ఫ్యాన్స్ మొరపెట్టుకున్నారు. అయితే మొత్తానికి ఈ వార్త వైరల్ అయ్యి ఒక సంచలనాన్ని సృష్టించింది... కాగా దీనిపై యూట్యూబర్ హర్ష సాయి స్పందిస్తూ..ఎప్పటికి బిగ్ బాస్‌కి వచ్చే ఛాన్సే లేదు.. అలాగే నాకు నా ఫ్రీడమ్ ఇంపార్టెంట్.. నాకు నచ్చినట్టు నేను ఉంటాను..అంతేకాదు  ప్రతిక్షణం నాకు నచ్చినట్లు మాత్రమే ఉండాలి అలాగే అసలు నా యూట్యూబ్ వీడియోలు కూడా.. టైంకి పెట్టాలి అన్నట్లుగా కాకుండా నాకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే చేస్తాను అని చెప్పుకొచ్చాడు. ఏదైతేనేం మొత్తానికి బిగ్ బాస్‌కి వచ్చేది లేనే లేదని హర్ష చాలా క్లారిటీగా చెప్పడంతో భలే మంచి నిర్ణయం తీసుకున్నావ్ అన్నా అంటూ అతని ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగా బిగ్  బాస్ యాజమాన్యానికి విచారకరమైన వార్త అని చెప్పాలి. ఇతను ఉంటె బిగ్  బాస్ రేంజ్ మారిపోతుంది. ఇప్పుడు బిగ్  బాస్ టీం ఏమి చేయనుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: