టీవీ: ఆది గురించి చెబుతూ కన్నీరు పెట్టుకున్న జబర్దస్త్ కమెడియన్ తల్లి..!!

Divya
బుల్లితెర మీద ఎన్నో కామెడీ షో లు ప్రసారం అవుతున్నప్పటికీ.. ఈటీవీ లో వస్తున్న జబర్దస్త్ కామెడీ షో కి మాత్రం కాస్త ఎక్కువ మంది ప్రేక్షకులు ఉంటారని చెప్పవచ్చు. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఎంతో మందికి సైతం ఈ షో జీవితాన్ని ఇచ్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి కమెడీయన్ లుగా గుర్తింపు పొందిన వారిలో పరదేశి కూడా ఒకరు. ఈయన హైపర్ ఆది టీమ్ లో చేస్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు వేసే డైలాగులతో ప్రేక్షకులను బాగా నవ్విస్తూ ఉంటాడు పరదేశి.
ఇటీవల తన తల్లితో కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో పాల్గొనడం జరిగింది. ఇక గతంలో వైజాగ్ లో జరిగిన ఒక సంఘటన గురించి గుర్తుకు వచ్చి పరదేశి, తల్లి కన్నీరు పెట్టుకోవడం జరిగింది. అయితే గతంలో  జబర్దస్త్ షో లో ఉండే దొరబాబు, పరదేశి ఇద్దరు వ్యభిచార గృహం లో దొరికిన విషయం అందరికీ తెలిసినదే. అయితే వీరిద్దరి ఇమేజ్ చాలా దెబ్బతిందని వార్తలు కూడా వచ్చాయి. ఇక వీరిద్దరిని పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో వీరి జీవితం అయిపోయింది అని ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు.

కానీ అలాంటి సమయంలో మాత్రం హైపర్ ఆది వారందరికీ తోడుగా ఉన్నారని.. కేవలం ఆయన పలుకుబడి ఉపయోగించి వారిని బయటికి  తెచ్చారని.. తిరిగి మళ్లీ వారిద్దరికీ అవకాశం హైపర్ ఆది ఇచ్చి ఇలా ఫేమస్ అయ్యేలా చేశారని శ్రీదేవి డ్రామా కంపెనీ లో పాల్గొన్న పరదేశి తల్లి తెలియజేసింది. ఆయన మేలు ఎప్పటికీ మరిచిపోలేమని ఆమె కన్నీరు పెట్టుకున్నది. పరదేశి మాట్లాడుతూ.. తనకు తండ్రి లేకపోయినా ఆది అన్న చాలా తోడుగా ఉన్నాడని మా అమ్మకు మా అన్న అంటే చాలా ఇష్టమని కన్నీరు పెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: