టీవీ: రంగులరాట్నం సీరియల్ రఘు రియల్ లైఫ్ స్టోరీ..!

Divya
రంగుల రాట్నం సీరియల్ కొద్ది రోజులే అయినా మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతూ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సీరియల్ లో హీరోగా రఘు పాత్రలో నటిస్తున్న రాజేష్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సీరియల్ లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రఘు గురించి చాలామంది తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రఘు యొక్క రియల్ లైఫ్ స్టోరీ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రఘు అసలు పేరు రాజేష్ దత్త. 1994 నవంబర్ 27వ తేదీన రాజేష్ విజయవాడ లో జన్మించారు. రాజేష్ దత్తా యొక్క ఎడ్యుకేషన్ విషయానికి వస్తే డిగ్రీలో బీకాం పూర్తి చేశారు. ఇక రాజేష్ కుటుంబం విషయానికి వస్తే.. నాన్న పేరు కొండబాబు స్టేజ్ ఈవెంట్ డైరెక్టర్ గా పని చేసేవారు. రాజేష్ అమ్మ పేరు భార్గవి.. ఈమె సోషల్ టీచర్ గా పనిచేశారు. ఇక రాజేష్ దత్త  కి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. నటన విషయానికి వస్తే రాజేష్ నాన్నగారు విజయవాడలో హరిశ్చంద్ర, సతీసావిత్రి,  చింతామణి వంటి నాటకాలు వేస్తూ.. దర్శకుడిగా కూడా పనిచేసేవారు.
రాజేష్ చిన్నప్పుడే ఆయన తండ్రి కొండబాబు నాటకాలు వేస్తూ ఉండడంతో తన తండ్రి నాటకాలు చూస్తూ పెరిగాడు. ఇక అలా నటన పైన ఆసక్తి ని పెంచుకున్నాడు రాజేష్ దత్త. ఇప్పటికే రాజేష్ నటనా రంగంలోకి అడుగు పెట్టడానికి కారణం తన తండ్రి అని పలు సార్లు చెప్పిన విషయం తెలిసిందే. నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలనే కారణంతో డిగ్రీ చదువుతున్నప్పుడు లోకల్ చానల్స్ లో యాడ్స్ లో పని చేయడం జరిగింది. ఇక రాజేష్ కి ఉన్న ఆసక్తిని చూసి రాజేష్ నాన్న కొండబాబు హైదరాబాదులో నటన లో కూడా ఇప్పించాడు. ఈటీవీలో ప్రసారమైన చదరంగం సీరియల్ ద్వారా బుల్లి తెరకు పరిచయం అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: