టీవీ : తన వల్లే తన జీవితం ఇలా అయింది అంటున్న బిగ్ బాస్ అఖిల్..!!

Divya
తెలుగులో బిగ్ బాస్ నాన్ స్టాప్.. హాట్ స్టార్ లో ప్రసారం అవుతూ మంచిగా దూసుకుపోతోంది.. ఇప్పటికే డిస్నీ హాట్ స్టార్ లో ప్రేక్షకుల ఆదరణ కాస్త పెరిగిందని చెప్పవచ్చు.. శివ కు సంబంధించిన కొన్ని విషయాల పట్ల.. ప్రేక్షకులకు కాస్త ఆసక్తి చూపించినట్లు గా కనిపిస్తోంది. సోషల్ మీడియా లో మెల్లమెల్లగా ఈ షో పై పెద్ద చర్చ జరుగుతోంది.. తాజాగా విడుదలైన ప్రోమో నుండి ఒక ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు జనాలలో ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్నారు.

ఈ రోజున ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లోని కంటెస్టెంట్ లు  చాలా సరదాగా ఎంజాయ్ చేసినట్లుగా కనిపిస్తోంది.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేసేందుకు కొన్ని టాస్క్ లు కూడా చేశారు. ఇందులో భాగంగా అఖిల్ ఒక తాగుబోతు క్యారెక్టర్ లో ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది. దాంతో బిగ్ బాస్ లో పాల్గొన్న బిందుమాధవి ని అతను టార్గెట్ చేయడం జరిగింది. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితం సంకనాకి పోయింది అని కామెంట్ చేశాడు అఖిల్. ఈ విషయాలు చెప్పడంతో అక్కడున్న వారందరూ తెగ నవ్వుకున్నారు.

ఇక అంతే కాకుండా నిన్ను ప్రేమించినందుకు తనని తాను కొట్టుకోవాలని.. నువ్వు మోసం చేసి పోయినప్పటికీ కూడా బిందుమాధవి అంటే తనకు ఇష్టమని అఖిల్ ఎంతో ఎమోషనల్ తో తెలియజేశారు. ఇది చూసిన వారు రియల్ గానే వీరిద్దరు మధ్య ఏదో ఉన్నట్లూ గా మెప్పించారు అఖిల్. దీంతో ఇప్పుడు ప్రేక్షకులు బుల్లితెర వర్గాల్లో వారంతా కూడా ఈ ఎపిసోడ్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక బిందుమాధవి కూడా అఖిల్ తో కలిసి బాగా ఎంటర్టైన్మెంట్ చేసినట్లుగా కనిపిస్తోంది. వీరిద్దరికి మొన్నటివరకు అస్సలు పడేది కాదు ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయింది.. ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు ఒకరినొకరు చాలా స్ట్రాంగ్ గా మార్చుకున్నారు.. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: