టీవీ:రెచ్చిపోయిన రోజా.. చేతులెత్తేసిన సుధీర్..!!
జబర్దస్త్ నుంచి ఒక ప్రోమో విడుదలవ్వగా ఇందులో వరుసపెట్టి రోజా వేసే పంచులకు ఆటో రాంప్రసాద్ కు సుడిగాలి సుదీర్ కు స్కిట్ లో మాటలు లేకుండా పోయాయి. ఇకపోతే ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్ పంచ్ లను రోజా ముందే కనిపెట్టి వరుసపెట్టి పంచ్ లు విసరడంతో దీంతో చెప్పేది ఏమీ లేక సుధీర్ తల పట్టుకుంటాడు. అన్నిటికంటే ఎక్కువగా సుధీర్ వేయాలనుకుంటే ఆ పంచ్ లను రోజా ఫటఫటా వేస్తూ ఉంటే సుదీప్ తెల్లముఖం వేసుకున్నాడు. ముఖ్యంగా హీరో డీజే టీల్లుతో సుధీర్ వేసిన పంచ్ మీద రోజా కౌంటర్ వేసి అందరికీ షాక్ ఇచ్చింది.
ఇందులోభాగంగానే సుదీర్ డీజే ఎక్కడ వాయిస్తారు అని అనడం.. అప్పుడు హీరో డీజే టిల్లు నీ చావుకు కూడా వాయిస్తాను అని అంటే వాడి చావు కంటే ఎక్కువగా వాడు పోలీసులకు ఎప్పుడు దొరుకుతాడా అని చాలామంది ఎదురు చూస్తున్నారు అని వెంటనే రోజా కూడా కౌంటర్ వేస్తుంది.. ఇక దీంతో ఏం మాట్లాడాలో తెలియక సుధీర్ రోజాకు దండం పెట్టేస్తాడు.. అలా రోజా దెబ్బకు సుధీర్ టీమ్ మొత్తం గజగజ వణికి పోయి నట్టు అనిపించింది.