టీవీ: స్టార్ హీరోయిన్ బాటలో దీప్తి సునైనా..!!

Divya
దీప్తి సునైనా.. ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముక్ లవర్ గా బాగా పాపులర్ తెచ్చుకుంది. అంతేకాదు యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లు , డాన్స్ లకు స్టెప్పులేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోంది.. ఇకపోతే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కూడా ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. ఇక తాజాగా షణ్ముఖ్ తో బ్రేక్ అప్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక స్టార్ హీరోయిన్ బాటలో దీప్తి సునైనా నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత..
సమంత సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాగచైతన్య తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకుంది. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో దంపతులు అంటే ఇలా ఉండాలి అని తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఇరువురు ఏమాత్రం మాట్లాడుకోకుండా  సినీ ఇండస్ట్రీలో ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. నాగచైతన్య , సమంతల విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగిందో ఆ తర్వాత దీప్తి సునైన , షణ్ముఖ్ బ్రేకప్ కూడా అంతే రచ్చ జరిగింది.

గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి షో లో కూడా త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నాము అని చెప్పడం.. ఇరువురి చేతుల పైన ఒకరి పేరు మరొకరు పచ్చబొట్టు వేయించుకోవడం అందరికీ తెలుసు. అంతలా మంచి కపుల్ గా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న ఈ జోడి విడిపోవడంతో ప్రతి ఒక్కరు షాక్ కి గురి అవుతున్నారు.సమంత - నాగచైతన్య లాగే ఎవరి లైఫ్ వారిది అన్నట్టుగా బిజీగా గడుపుతోంది ఈ జంట..ఇక సమంత లాగే దీప్తి సునైనా కూడా తన బాధను వ్యక్తపరచడానికి ఎక్కువగా సోషల్ మీడియాలో గడపడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: