టీవీ:రష్మి-సుధీర్లను వాడుకోకండి..అంటున్న జబర్దస్త్ కమెడీయన్..!!

Divya
సోషల్ మీడియా వచ్చినప్పట్నుంచి.. ప్రతి ఒక్కరూ అందులోనేలీనమైపోతూ ఉన్నారు.. ఈ సోషల్ నెట్వర్క్ వల్ల ఎంతోమంది బాగానే పాపులర్ అయ్యారు.. ఎంతోమంది మోసపోవడం కూడా జరిగింది. ఇక ఈ ఆన్లైన్ వచ్చినప్పటినుంచి అసత్య ప్రచారాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది ప్రముఖులు, సినీ సెలబ్రిటీస్, బుల్లితెర సెలబ్రిటీస్ విషయంలో పుకార్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తాజాగా జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ పై కూడా ఇలాంటి వార్త రావడం తో ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

కొంతమంది సెలబ్రిటీస్ లను వాడేస్తూ..వారి వ్యాపార సంస్థలను అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు ఎంతో మంది చేస్తున్నారు.. ఇంస్టాగ్రామ్,ట్విట్టర్ ,ఫేస్ బుక్ వంటి వాటిలో సరికొత్త పుకార్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి.. ఇక ఈ క్రమంలోనే తాజాగా రష్మి సుదీర్ జోడి కున్న.. పాపులారిటీ విషయాన్ని జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ వాడుకున్నట్లుగా బాగా ప్రచారం జరుగుతోంది. ఇక అసలు విషయం ఏమిటంటే రష్మి సుదీర్ కలిసి ఒక ఈవెంట్లో.. పాల్గొనడం జరిగింది. అందులో కొన్ని కాస్ట్యూమ్స్ ను శాంతి స్వరూప్ ధరించి ఉందంటు ఒక ఫేక్ న్యూస్ తాజా గా పుట్టుకొచ్చింది.
రష్మీ ధరించిన ఆ కాస్ట్యూమ్స్ ను రష్మి శాంతిస్వరూప్ ఇచ్చిందంటూ నెట్టింట కొంతమంది కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ ఫోటోను చూసిన సదరు నెటిజెన్స్ మాత్రం ఈ డ్రెస్ పై కామెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. దీంతో శాంతిస్వరూప్ కోపం తెచ్చుకొని.. ఇలాంటి ఫేక్ న్యూస్ ను పాపులర్ చేస్తున్న ఒక వ్యక్తికి చెందిన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఈ విషయంపై ఎలాంటి తప్పుడు ప్రచారం చేయకండి.. రష్మి వేసుకున్న కాస్ట్యూమ్స్ నాకు బాగా నచ్చడంతో నేను కూడా ఇలాంటి చేయించుకున్నాను అని తెలియజేసింది. మీరు నిజాలు తెలియకుండా ఇలాంటి పోస్టులు పెట్టొద్దని అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీంతో సుధీర్ రష్మి కి ఉన్న పార్టీని వాడుకోకండి అని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: