టీవీ:దేవత సీరియల్ యాక్టర్ సత్య..లైఫ్ స్టైల్ ఇదే..!!

Divya
బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి కొన్ని సీరియళ్లలో మంచి టిఆర్పి రేటింగ్ సాధించిన నాటికలలో దేవత సీరియల్ కూడా ఒకటి అని చెప్పవచ్చు.. ఇక ఈ నాటిక కంటే ముందు వరుసలో కార్తీకదీపం, గృహలక్ష్మి వంటి సీరియల్స్ ఉన్నాయని చెప్పవచ్చు.. ఈ సీరియల్స్ అన్ని స్టార్ మా లో ప్రసారం అవుతూ ఉండటం గమనార్హం.. ఈ నాటిక ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది ఈ సీరియల్ ను ఆదరించారు.. దీంతో ఇప్పుడు దేవత సీరియల్ ఆల్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. ఇక ఈ నాటికలోని సత్య పాత్రలో వైష్ణవి నటించింది.. కానీ ఈమె ఈ సీరియల్ నుంచి కొన్ని కారణాల వల్ల వైదొలిగింది.

అయితే ఈమె  సీరియల్ నుంచి తప్పుకున్న విషయం సీరియల్ చూస్తున్న ప్రతి ఒక్కరు తెలుసు.. కానీ వైష్ణవికి ఈ ప్రశ్న ఎదురవగానే కొన్ని పర్సనల్ కారణాల వల్ల ఈ నాటిక నుంచి తప్పుకున్నానని తెలిపినట్లు సమాచారం. అయితే ఈమె స్థానంలో కి మరొక బుల్లితెర నటి మానసి జోషి నటిస్తోంది.. ఇక ఆమె కూడా 1993వ సంవత్సరంలో సెప్టెంబరు 7 వ తేదీన బెంగళూరులో జన్మించింది.. ఈమె విద్యాభ్యాసం నుంచి నటిగా పేరు పొందే వరకు అక్కడే చదువుకుంది. ఈమెకు కూడా తన చిన్న వయస్సు నుంచి యాక్టింగ్ మీద ఎక్కువ ఇష్టం ఉండడంతో.. చదువు పూర్తయ్యాక మోడలింగ్ వైపు తన అడుగులు వేసింది.
అలా మొదటిసారిగా కొన్ని యాడ్స్ లో నటించింది ఈమె.. సినిమా అవకాశాల కోసం కన్నడ ఇండస్ట్రీ వైపు అడుగు వేసిన.. అక్కడ అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కొన్ని సినిమాలలో నటించింది.. కన్నడలో రాధారమణ అనే నాటికలో నటించి బుల్లితెరపై మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చింది. అలా తమిళంలో  అడుగువేసి,  ఆ తరువాత  తెలుగు సీరియల్స్ లో దేవత సీరియల్ సత్య క్యారెక్టర్ లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: