టీవీ: గుప్పెడంత మనసు సీరియల్ గౌతమ్ రియల్ లైఫ్ స్టోరీ..!!

Divya
రోజురోజుకు ఎంటర్టైన్మెంట్ చానల్స్ ఎక్కువవుతున్న నేపథ్యంలో సీరియల్స్ కూడా పోటాపోటీగా ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి ముందుకొస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఒక్కసారి సీరియల్ చూస్తే నెక్స్ట్ డే ఏమవుతుందో అని ప్రేక్షకులు అంతగా ఎదురు చూసేలా ఈ సినిమాల దర్శకులు చేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక సినిమాలను తలపించేలా ఈ సీరియల్స్ ఉండటంతో ప్రతిరోజు సిరీస్ లాగా వస్తూ ఉండడం వల్ల ప్రేక్షకులు బాగా మక్కువ చూపుతున్నారు. ఇకపోతే తాజాగా గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు గౌతమ్.. గౌతమ్ రియల్ లైఫ్ స్టోరీ గురించి.. అతను అసలు పేరు ఏమిటి ..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న గౌతమ్ అసలు పేరు కిరణ్ కాంత్.. విజయవాడలో జనవరి 18వ తేదీన జన్మించారు.. విశ్వ భారతి హై స్కూల్ లో స్కూలింగ్  పూర్తిచేసిన గౌతమ్,  శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ వరకు పూర్తి చేశారు. కేఎల్ యూ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. బీటెక్ విద్యను పూర్తి చేసిన గౌతం సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు.
అలా ప్రయత్నం చేస్తున్న సమయంలో మొదట సత్తా, ఖిలాడీ, నామనసు నాది కాదు, ప్రేమలో సీతతో శ్రీరామ్ వంటి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు.గౌతం ను  చూస్తేనే టీనేజ్ అబ్బాయిలా కనిపిస్తూ ఉంటాడు.. కానీ అందరికీ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే..ఇతడికి ప్రేరణి అనే ఆమెతో పెళ్లయింది. ఇక షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న సమయంలో సూపర్ హిట్ మూవీ గా గుర్తింపు తెచ్చుకున్న జానకీరాముడు మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది. క్రేజ్ మేటర్స్ అనే వెబ్ సిరీస్ లో  కూడా నటించిన గౌతం  తర్వాత స్టార్ మాలో ఉయ్యాలా జంపాల అనే  సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అమ్మ, పౌర్ణమి,  అక్క మొగుడు వంటి సీరియల్స్ లో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: