టీవీ:వారి మోజులో పడి మా నాన్ననే మోసం చేశాను:లాస్య
అయితే ఈ షో లో నే యాంకర్ లాస్య కన్నీరు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. తన ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి తన తండ్రి అంగీకరించలేదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటువంటి సన్నివేశాన్ని రష్మి గౌతమ్ ఒక డ్యాన్స్ రూపంలో చేసి తెలియజేసింది. ఇక అంతే కాకుండా ఆ వీడియోలో రష్మీ నాన్నా.. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను.. మీరు ఒప్పుకుంటే తనని వివాహం చేసుకుంటానని చెప్పుకొచ్చింది.. కానీ తన తండ్రి మాత్రం పరువు కోసం ప్రాణం ఇస్తాను కానీ.. ఈ పెళ్లికి ఒప్పుకోను అంటూ తెలియజేస్తారు.. ఈ పాత్రలో రాకెట్ రాఘవ నటించారు. ఇక ఆ తర్వాత ఐ యాం సారీ నాన్నా అని చెబుతూ.. రష్మీ అక్కడి నుంచి బయటికి వెళ్లి పోతుంది.. ఈ సన్నివేశాన్ని చూసిన లాస్య ఒక్కసారిగా కన్నీటి పర్వతం అయితుంది.
ఇక అప్పటి వరకు తన మనసులో ఉన్న ఒక విషయాన్ని తెలియజేసింది.. నేను కూడా రష్మీ ఈ వీడియోలో ఎలా చేసిందో నా జీవితంలో కూడా అలాగే చేశానని చెప్పుకొచ్చింది. మనల్ని ప్రేమించిన వాళ్ళను బాధ పెట్టకూడదు.. కానీ అప్పుడు కళ్ళు మూసుకుపోవడం వల్ల ఇలా చేశానని చెప్పుకొచ్చింది. ఈ పర్ఫార్మెన్స్ చూస్తే.. తన తండ్రి గుర్తుకు వచ్చినట్లు ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంది..