'బిగ్ బాస్ 6' కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే షాక్ తప్పదు?

VAMSI
తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ షో రీసెంట్ గా ముగిసిన విషయం విదితమే. ఇప్పటికీ అయిదు సీజన్ లను విజయవంతంగా కంప్లీట్ చేయగా గతంలో ఎన్నడూ ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ పై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. మొదట్లో ఇందుకు కారణం బిగ్ సెలబ్రిటీలు ఎవరూ లేకపోవడం అయితే ఆ తర్వాత షో మొదలయ్యాక సిరి, షన్ను ల హాగ్గుల వ్యవహారమే. అయితే మొత్తానికి ప్రేక్షకులకు నచ్చిన మరియు మెచ్చిన విజె సన్నీనే విజేతగా గెలిపించి సంతోషంగా సీజన్ ఫైవ్ కి శుభం కార్డు వేశారు. అయితే ఈసారి సీజన్ సిక్స్ ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దడానికి బిగ్ బాస్ మళ్లీ పాపులర్ సెలబ్రిటీలను రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈసారి కూడా వైరస్ ఉనికి కారణంగా పోయిన సీజన్ లో  లాగా మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేకుండా ఒకేసారి 19 మంది సభ్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడానికి ప్రణాళిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా సీజన్ సిక్స్ లో కనిపించే సెలబ్రిటీలు ఎవరంటే...?? కొందరి పేర్లు వెలువడుతున్నాయి వారెవరో ఇప్పుడు చూద్దాం.
తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయిన నటి సురేఖ వాణి, తెలుగమ్మాయి హీరోయిన్ ఇషా రెబ్బ, హాస్య నటుడు సప్తగిరి, అమెరికా అమ్మాయి అలాగే సిరిసిరి మువ్వలు సీరియల్ తో కావ్య పాత్రతో బాగా పాపులర్ అయిన సీరియల్ హీరోయిన్ మెరిన, యాంకర్ విష్ణు ప్రియ వంటి వారి పేర్లు వినపడుతున్నాయి. మరి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో మనల్ని అలరించేందుకు ఎవరు రాబోతున్నారో అన్నది తెలియాలంటే అదికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడక తప్పదు.  ఈ శనివారం నుండి బిగ్ బాస్ ప్లేస్ లో ఇస్మార్ట్ జోడి సీజన్ 2 ప్రసారం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: