బిగ్ బాస్ 5: రాత్రికి రాత్రి మారిన సమీకరణాలు... షణ్ముఖ్ తప్పిదేనా?
ఎందుకంటే ఎటు తిరిగి వారికి ఓట్లు వేయాల్సింధీ ఆడియన్సే కదా. కానీ చాలా మంది ఈ మాటను అంగీకరించరు, బిగ్ బాస్ హౌజ్ లో జరిగేదంతా ఒట్టి షూటింగ్ మాత్రమే అని, స్క్రిప్ట్ ప్రకారమే వారు నటిస్తారని అంటుంటారు. కానీ దీన్ని మనం నిజమని ఖచ్చితంగా తేల్చి చెప్పలేని పరిస్థితి. ఇవన్నీ పక్కన పెడితే సీజన్ ఫైవ్ లో ఇపుడు కేవలం 6 మంది మాత్రమే మిగిలారు. ఇక ఈ ఆదివారం మరో కంటెస్టెంట్ ఇంటి నుండి బయటకు వెళ్లాల్సి ఉండగా మిగిలిన వారు టాప్ ఫైవ్ లో ఉంటారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వారం బయటకు వెళ్లబోయేది షన్నునే అంటూ వార్తలు వినపడుతున్నాయి.
నిన్న మొన్నటి వరకు విన్నర్ లిస్ట్ సన్ని, శ్రీ రామ్ లతో పాటు షన్ను పేరు కూడా సమానంగా వినిపించేది. అలాంటిది ఇపుడు మారిన సమీకరణాల ప్రకారం షన్ను ఈవారం ఇంటి నుండి ఎలిమినేట్ అవబోతున్నాడు అని తెలుస్తోంది. వాస్తవానికి షన్ను ఒక్క సిరి విషయంలో తప్ప హౌజ్ లో పెద్దగా యాక్టివ్ ఉండడు అన్నది చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం. అయితే ఈ వారం హౌజ్ నుండి వెళ్ళేది షన్నునో కాదో చూడాలి.