బిగ్ బాస్ 5: షన్ను పై పెరుగుతున్న వ్యతిరేకత...కారణం తెలిస్తే షాక్?

VAMSI
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎక్కువగా కనిపించిన మరియు వినిపించిన జంట షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ లది. బిగ్ బాస్ హౌజ్ లో ఏ మూల చూసినా వీరే కనిపిస్తుంటారు. ఎక్కడ విన్నా వీరి మాటలే వినపడుతుంటాయి. వీళ్ళ హగ్ ల పర్ఫామెన్స్ అయితే మరి ప్రత్యేకం. ఆనందమైనా దుఃఖమైనా సందర్భం ఏదైనా సరే వీరి మధ్య హగ్ పడిపోవాల్సిందే. తరవాత షన్ను అంటూ ఇది ఫ్రెండ్షిప్ హగ్ అనాల్సిందే. లాస్ట్ టైం అందరి కుటుంబ సభ్యులు హౌజ్ లోకి వచ్చి వారి వారి కంటెస్టెంట్ కి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చెబుతూ అలర్ట్ చేశారు. ఇదే తరహాలో సిరి వాళ్ళ అమ్మ హౌజ్ లోకి వచ్చి కుమార్తె సిరికి జాగ్రత్తలు చెప్పింది. అలాగే షన్నును హగ్ లు ఆపేయమని అందరి ముందు అన్నారు.
ఇక అప్పటి నుండి ఎప్పుడు హగ్ చేసుకోవాల్సి వచ్చినా 'ఆంటీ ఇది ఫ్రెండ్షిప్ హగ్' మాత్రమే అంటుంటాడు. కానీ చూసే వారికి మాత్రం ఈ గోల ఇబ్బందిగానే ఉంది. ముందు ఈ ఇద్దరినీ ఇంట్లో నుండి ఎలిమినేట్ చేసేయండి బిగ్ బాస్ అంటున్నారు కొందరు నెటిజన్లు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ కొందరి ప్రేక్షకుల ప్రశ్నలకు జెన్యూన్ గా సమాధానం చెప్పాలని ఆ ప్రశ్నలను ఇంటి సభ్యుల ముందు ఉంచారు బిగ్ బాస్. ఈ క్రమంలో ఓ ప్రేక్షకుడు షన్నును అడిగిన ప్రశ్న సిరికి షాక్ ఇచ్చినట్లయింది. షన్ను మీరు ఎందుకు ఎప్పుడు సిరి విషయంలో పొసెసివ్ గా ఉంటారు.
అతి జాగ్రత్తగా ఫీల్ అవుతుంటారు, తనకోసం అందరితో గొడవ పెట్టుకుంటారు అన్నట్లుగా అడిగితే..అందుకు షన్ను  అవునండి అది నిజమే. కానీ ఎందుకో నాకు కూడా క్లారిటీగా తెలీదు. కానీ తనంటే ఒక ఫ్రెండ్ గా నాకు చాలా కన్సర్న్ ఉంది. అందుకే బహుశా మరీ ఎక్కువ కేర్ తీసుకుంటున్నానేమో అని అన్నారు షన్ను. అయితే సిరి ఒక్క విషయం లోనే మరీ అంత కేరింగ్ ఉండటం కరెక్ట్ కాదు బాస్ అంటూ కౌంటర్లు వేస్తున్నారు కొందరు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: