బిగ్ బాస్ 5: సన్నీ కన్నా మానస్ సత్తా చాటుతున్నాడు...

VAMSI
బిగ్ బాస్ హౌజ్ లో ఇపుడు మిగిలింది ఏడు మందే సన్ని, శ్రీ రామ్ చంద్ర, మానస్, కాజల్, సిరి, ప్రియాంక సింగ్, షన్ను లు మాత్రమే. అయితే సీజన్ ఫైవ్ ఫినాలే దశకు వచ్చే సరికి వీరిలో చాలా మార్పులు కనబడుతున్నాయి. ముఖ్యంగా సన్ని, మానస్, కాజల్ లు మొదట్లో కంటే ఇపుడు చాలా మారారు. ఒకరి తప్పులను ఒకరు సమర్ధిస్తూ కలిసి కట్టుగా ఉండే ఈ గ్రూప్ లో కలతలు వస్తున్నాయి. కారణం ఇపుడు గేమ్ చివరి దశకు వచ్చింది. ఉన్నది ఏడు మందే మరి ఇక పోటీ వీరి మధ్యే కదా...గెలవాలంటే అవతలి వారిని ఒడించాల్సిందే. ఇది సహాయం చేసుకునే సమయం కాదు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టైటిల్ కొట్టాలంటే అన్నిటినీ అధిగమించి అందరికన్నా మిన్నగా నిరూపించుకోవాల్సి ఉంటుంది.
మానస్ అయితే ఇపుడు చాలా చాలా మారడనే చెప్పాలి. ఒకప్పుడు సన్ని కోసం ఏమైనా చేసే మానస్ ఈ మధ్య గేమ్ లో క్లోజ్ ఫ్రెండ్ అన్న విషయాన్ని పక్కన పెట్టి తన గేమ్ తాను ఆడుకుంటున్నాడు. అది కూడా స్ట్రాటజీలు ఉపయోగించి కొన్ని సందర్భాల్లో సన్నిని పక్క దోవ పట్టించి హ్యాండ్ ఇస్తున్నాడు కూడా. ఆ విషయం సన్నికి అర్దం అయినా, సిట్యువేషన్ ను అర్దం చేసుకుని సర్దుకుపోతున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో కూడా సన్ని కి ఛాన్స్ యివ్వకుండా తనకి ఎలాంటి టాస్క్ కావాలో సెలెక్ట్ చేసుకుంటున్నాడు. పక్కన సన్ని చెబుతున్నా అస్సలు వినలేదు. ఇక కాజల్ ఎడ్డెం అంటే తెడ్డెం అంటోంది. ఆఖరికి సన్నితో కూడా గొడవలు పడుతోంది.
తన మాట తనదే తప్ప ఇతరుల మాటలను అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక సన్ని విషయానికొస్తే ఇతడు ముందుకన్నా ఇపుడు మరింత ఎక్కువగా గేమ్ పై ఫోకస్ పెట్టాడు. టికెట్ టు ఫినాలే టాస్క్ లోనూ అందరికంటే ముందుగా మానస్ ఉన్నాడు. అన్ని టాస్కు ల్లో అలెర్ట్ గా ఉంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఒకప్పుడు ఫ్రెండ్స్ కోసం తను పోరాడే సన్ని ఇపుడు కేవలం తన విన్నింగ్ కోసమే దృష్టి పెడుతున్నాడు. ఇలా ఈ చిన్న గ్రూప్ లో చిన్న మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మానస్...తనని నమ్మిన సన్నిని డైవర్ట్ చేసి మరీ గేమ్ ను ఆడిస్తున్నాడు. చివరికి స్నేహం వలన ఇంకెన్ని నష్టాలు వారి మధ్యన జరగనున్నాయి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: