సీరియల్ నటికి ఐటెం సాంగ్ ఆఫర్?

VAMSI
సాధారణంగా సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులు సినీ రంగం వైపు కూడా అడుగులు వేస్తుంటారు. అలాగే సినీరంగంలోని కొందరు నటులు బుల్లి తెరపై సందడి చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది సినీ తారలు సీరియల్స్ లో నటిస్తూ అలరిస్తుండగా, ఇటు చిన్న స్క్రీన్ పై సందడి చేసే నటీ నటులు కూడా చాలా మంది సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా బుల్లి తెర నుండి వెండి తెరకు...వెండి తెర నుండి బుల్లి తెరకు నటులు బదిలీ అవుతూ ఉండటం ఇపుడు చాలా ఎక్కువయ్యింది అనే చెప్పాలి. ఈ మధ్యనే సీనియర్ హీరోయిన్ రాశి 'జానకి కలగనలేదు' సీరియల్ లో నటిస్తూ ఉండగా, మరో సీనియర్ నటి ప్రభ కూడా మరో కొత్త సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇలా చాలా మంది సినీ తారలు సినీ రంగంలో ఉన్నారు.  కాగా ఇప్పుడు లేటెస్ట్ హాట్ టాపిక్ ఏమిటంటే ఓ సీరియల్ నటి స్టార్ హీరో చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక అయినట్లు తెలుస్తోంది. అది మరి ఇంకెవరో కాదు 'ఆమె కథ' సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన నటి మహేశ్వరి. ఈమె 'నా పేరు మీనాక్షి' వంటి పలు సీరియల్స్ తో మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. అయితే ఈ కన్నడ భామకు ఓ స్టార్ హీరో చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈమె సింగిల్ గా కాదట ఆ సినిమాలోని హీరోయిన్ కూడా ఆ ప్రత్యేక పాటలో స్టెప్పులు వేయబోతుండగా, ఆమెతో పాటు మరో డ్యాన్సర్ గా నవ్య స్వామి ఆ హీరోయిన్ తో పాటు కలసి ఆ స్పెషల్ సాంగ్ లో చిందులేయనుంది అని సమాచారం. అయితే ఇదే విధంగా ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. అయితే అవకాశాలు అందిపుచ్చుకున్న అందరూ రాణించలేరన్నది కాదనలేని వాస్తవం. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: