బిగ్ బాస్ 5: కాజల్ పై మండిపడుతున్న ఆ సింగర్ ఫ్యాన్స్?

VAMSI
నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌజ్ లో రచ్చ రచ్చ జరిగింది. బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్ పోటీ ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టింది. అందులోనూ బిగ్ బాస్ హౌజ్ లో ఇదే ఆఖరి కెప్టెన్సీ అనడంతో అందరూ షాక్ అయ్యారు. అంతకుమించి అలెర్ట్ అయ్యారు. ఎలాగైనా హౌజ్ లో లాస్ట్ కెప్టెన్ గా నిలిచి ఆ మార్క్ ను పొందాలని తహతహలాడారు. అదీకాక కెప్టెన్సీ పోటీలో విన్ అయి కెప్టెన్ అయితే నామినేషన్ నుండి తప్పించుకోవచ్చు, తద్వారా డైరెక్ట్ గా టాప్ ఫైవ్ లో నిలవడం సులభం అవుతుంది అని అందరు ఫుల్ ఎఫర్ట్ పెట్టేసారు. కాగా ఈ క్రమంలో అందరూ అవసరానికి మించి అవేశపడ్డారని చెప్పాలి, చివరి కెప్టెన్సీ కావడంతో వారిలో తెలియని ఉత్సాహం ఉరకలు వేసింది.
ఇందులో మొదట టాస్క్ నుండి ఎలిమినేట్ అయిన సన్ని అందరికీ నేనే టార్గెట్ అంటూ ఎమోషన్ అయ్యారు. అక్కడ అయితే ఒక మెట్టు తగ్గాడు. కానీ నిజానికి బయట ప్రజల్లో మరో స్థాయికి చేరుకున్నారు సన్ని. చూసిన వారంతా ఆయ్యో పాపం సన్ని చెప్పే దాంట్లో న్యాయం ఉంది కదా అని ఫీల్ అయ్యారు. ఇక శ్రీ రామ చంద్ర కి సింహాసనంలో స్థానం దొరకగా లిస్ట్ లో రవి, కాజల్ లు నిలిచి తన ముందు నిలుచున్నారు. అయితే నాకు కాజల్ ని సపోర్ట్ చేయాలని ఉంది. ఫ్రమ్ ది బాటం ఆఫ్ మై హార్ట్ కాజల్ కెప్టెన్ అవ్వాలని  ఉంది అంటూనే తన మాటల్ని  అటు తిప్పి, ఇటు తిప్పి చివరికి రవి ని సేవ్ చేసి కాజల్ ని టాస్క్ నుండి తొలగించాడు. దాంతో కాజల్ కోపంతో ఊగిపోయింది.
 
మనసులో డిసైడ్ అయ్యి పైకి కాజల్ ని సేవ్ చేయాలని ఉంది అని అనడం ఎందుకు అంటూ అరచి గగ్గోలు పెట్టింది. ఆ తరవాత శ్రీ రామ్ కూడా కెప్టెన్సీ పోటీ నుండి ఎలిమినేట్ అవడంతో సంతోషంతో ఉప్పొంగిన కాజల్ హే హే హే అంటూ డ్యాన్స్ వేసింది. అపుడు గతం వారంలో ఆనీ మాస్టర్ తనని వెక్కిరిస్తు డ్యాన్స్ చేసినట్లుగానే..ఇపుడు రామ్ ని కామెంట్ చేస్తూ డ్యాన్స్ చేసింది. కానీ రామ్ మాత్రం కామ్ గానే ఉండిపోయాడు. దాంతో బయట శ్రీ రామ్ చంద్ర ఫ్యాన్స్ కాజల్ పై మండిపడుతున్నారు. చాలా ఓట్లు కూడా కోల్పోయినట్లు తెలుస్తోంది. అందులోనూ ఎలిమినేషన్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: