బిగ్ బాస్ 5: "సిరి - ప్రియాంక"ల మెడకు కత్తి... నిలిచేది ఎవరు?
ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లను సెలెక్ట్ చేసి ఒప్పందం కుదుర్చుకుందట బిగ్ బాస్ యాజమాన్యం. ఈసారి బిగ్ బాస్ ఫినాలే స్టేజ్ కళ్ళు జిగేలుమనేలా ఉండబోతోందట. ఇక హౌజ్ లో 12 వారం నామినేషన్ లో కెప్టెన్ గా ఉన్న ఒక్క మానస్ తప్ప మిగిలిన సన్నీ, రవి, షణ్ముఖ్, శ్రీరామ్, కాజల్, ప్రియాంక, సిరి లు నామినేషన్ లో ఉన్నారు. సన్ని ఓటింగ్ తో దూసుకు పోతూ ఉండగా షన్ను రెండవ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మూడవ స్థానం లో రవి, ఆ తర్వాత శ్రీ రామ్, ఆ తర్వాత అయిదవ స్థానంలో సిరి ఉన్నారు.
ఇక మిగిలింది మానస్, ప్రియాంక మరియు కాజల్ లు. అయితే మానస్ ఎలాగో కెప్టెన్ కాబట్టి ఈవారం సేవ్ అయిపోతారు. ఇక మిగిలిన ప్రియాంక, కాజల్ లలో పింకీ ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వారం చాలా ఇంపార్టెంట్ అందుకే అందరూ టాస్క్ లలో జోరుగా పాల్గొంటూ గెలవడానికి 100 శాతం శ్రమిస్తున్నారు.