నకిలీ నోట్లను ఇలా ఈజీగా గుర్తించండి..?

Divya
దేశంలో ఈ మధ్య నకిలీ కరెన్సీ నోట్ల బెరద ఎక్కువగా ఉంది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆందోళన చెందుతోంది.ఈ ఆర్థిక పరిస్థితి వల్ల సాధారణ ప్రజలకు పెను సవాల్గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది నిపుణులు సైతం సాధారణ ప్రజలు నకిలీ నోట్లను ఎలా గుర్తించాలనే విషయంపై కొన్ని సూచనలు ఇచ్చారు. కొన్ని ముఖ్యమైన భద్రత లక్షణాల పైన అవగాహన ఉండేలా నకిలీ నోట్లను సులువుగా గుర్తించుకోవచ్చు అని తెలియజేస్తున్నారు.


పెద్ద నోట్ల మధ్యలో నిలువుగా ఉండే దారం చాలా సాధారణంగా ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. అయితే అదే నోటుని కొద్దిగా వంచినప్పుడు ఆ రంగు ఆకుపచ్చ నుంచి నీలిరంగులోకి మారుతుంది.


నోట్ల రెండు అంచులలో ఉండే గీతలు కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటాయి.వాటిని చేతితో తాకినప్పుడు ఉబ్బెత్తు గీతను చాలా స్పష్టంగా గుర్తించవచ్చు. రూ.500 రూపాయల నోటులో ఐదు బ్లీడ్ లైన్స్ ఉంటాయి, అలాగే 2000 రూపాయల నోటుకు 7 లైన్స్ ఉండేవి.


నోటు ఎడమవైపు మూలాలలో నిర్దిష్ట కోణంలో చూసినప్పుడు 500 అనే సంఖ్య ముద్రించడం కనిపిస్తుందట.


నోటు కుడి వైపు ఖాళీ ప్రదేశంలో కాంతికి ఎదురుగా ఉంచినప్పుడు మహాత్మా గాంధీ బొమ్మ నోటు మీద చిరునవ్వుతో కూడిన చిత్రంగా కనిపిస్తుంది. నకిలీ నోట్లలో మాత్రం అది అంత స్పష్టంగా కనిపించదు.


500 రూపాయల నోటుకి కుడివైపున అశోక్ పిల్లర్ పైన ఒక వృత్తాకారపు ఉబ్బెత్తు గుర్తు కనిపిస్తుంది. దానిలో కూడా 500 రూపాయలు అని ముద్రించబడి ఉంటుంది. 200 రూపాయల నోటుకు H అక్షరం, 100 రూపాయల నోటుకు వృత్తాకారపు గుర్తు కలదు.

15 భారతీయ భాషలలో నోటు విలువను సూచించే విధంగా లాంగ్వేజ్ ప్యానెల్ , భారత జెండాతో పాటు ఎర్రకోట చిత్రం కూడా మనం చూడవచ్చు.

ఇలా వీటన్నిటిని గుర్తించగలిగితే ఇందులో ఏదో ఒకచోట కచ్చితంగా తేడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: