‘రాకాస’ ప్రీమియర్ షోలో మెగా ఫ్యామిలీ హంగామా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
హైదరాబాద్‌లో జరిగిన ‘రాకాస’ స్పెషల్ ప్రీమియర్ షోకు మెగా కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చి నిహారికకు అదిరిపోయే సపోర్ట్ ఇచ్చారు. సుస్మిత కొణిదెల, శ్రీజ కొణిదెలతో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి దంపతులు సందడి చేశారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ థియేటర్‌లో ‘మాస్’ ఆడియన్ లాగా విజిల్స్ వేస్తూ, అల్లరి చేస్తూ నిహారికను ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘కల్కి 2898 AD’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈ ప్రీమియర్‌కు హాజరై సినిమాను వీక్షించి, నిహారిక మేకింగ్ స్టైల్‌ను అభినందించడం విశేషం.
సినిమా చూసిన అనంతరం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా తన రెస్పాన్స్‌ను ‘మాస్’ లెవల్లో పంచుకున్నారు."రాకాస చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంది. ముఖ్యంగా కామెడీ సినిమాకు అసలైన హైలైట్. థియేటర్‌లో నవ్వు ఆపుకోవడం ఎవరితరం కాదు" అని వరుణ్ తేజ్ అభిప్రాయపడ్డారు.హీరో సంగీత్ శోభన్ పెర్ఫార్మెన్స్‌ను మెచ్చుకుంటూ అతనిలో మంచి స్పార్క్ ఉందని ప్రశంసించారు. అలాగే వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించారని పేర్కొన్నారు.దర్శకురాలు మానస శర్మకు, తన చెల్లెలు నిహారికకు వరుణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గలేదని టాక్.
సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి వంటి భారీ తారాగణం ఉంది. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ కథ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తోంది. నిర్మాతగా నిహారిక ఎంచుకుంటున్న కథలు ఆమె టేస్ట్‌ను ప్రతిబింబిస్తున్నాయి. ‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత ఈ ‘రాకాస’తో ఆమె మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.మొత్తానికి ప్రీమియర్ షోల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకున్న రాకాస బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి. ప్రేక్షకుల నుంచి వచ్చే పూర్తి స్థాయి స్పందనతో సినిమా అసలు ఫలితం తేలనుంది.