బిగ్ బాస్ సీజన్ 6 కి హోస్ట్ గా యంగ్ టైగర్?

VAMSI
బుల్లి తెరపై ఎనలేని క్రేజ్ తో ఫుల్ రేటింగ్ తో దూసుకుపోతున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటి వరకు నాలుగు సీజన్ లకు సూపర్ హిట్ అందుకున్న ఈ షో ప్రస్తుతం అయిదవ సీజన్ రన్ అవుతోంది. దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. మొత్తం 19 మంది హౌజ్ లోకి అడుగు పెట్టగానే ఇప్పటి వరకు సగం మందికి పైగానే ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం తొమ్మిది మంది బిగ్ బి ఇంట్లో ఉండగా వారిలో అయిదుగురు ఫైనల్ కు చేరుతారు. సో అప్పుడు ఎలిమినేషన్ స్టేజ్ పైనే ఉంటుంది. కాబట్టి డిసెంబర్‌ 19న ఈ సీజన్ కి ఎండ్ కార్డ్ వేయాలని సన్నాహాలు చేస్తున్నారట బిగ్ బాస్ యాజమాన్యం. అయితే ఈ సీజన్ అయిపోగానే మరో సీజన్ మొదలవడానికి ఎలా కాదన్నా ఓ ఆరు నెలలు పడుతుంది.
కానీ ఇదేమి ఆషామాషీ షో కాదు. కాబట్టి నెక్స్ట్ సీజన్ కి ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ చేస్తేనే ఆ టైం అంతా సెట్ అవుతుంది కాబట్టి ఇపుడే సీజన్ సిక్స్ కి ప్లానింగ్ మొదలెట్టేసారట బిగ్ బాస్ టీం. కాగా సీజన్ సిక్స్ అంతకు మించి పీక్స్ కు వెళ్లేలా ఉండేందుకు హోస్ట్ గా మళ్ళీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం గురించి బిగ్ బాస్ యాజమాన్యం ఎన్టీఆర్ తో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. హీరోగా ఎన్టీఆర్ ది వేరే లెవల్ అయినప్పటికీ బుల్లితెరను ఏనాడూ తక్కువ చేసి చూడరు తారక్.
మొదటి సీజన్ లో ఎన్టీఆర్ చేసిన హోస్టింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.  హౌజ్మేట్స్ చేసే ప్రతి తప్పుని కౌంట్ చేసి ఎవ్వరికివ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తుంటారు ఎన్టీఆర్. అలాగే బాగా ఆడిన వారిపై ప్రశంసలు కురిపిస్తుంటారు. దాంతో మరింత రసవత్తరంగా మారుతుంది. ప్రస్తుతం తారక్ జెమినీ టీవీ లో మీలో ఎవరు కోటీశ్వరుడు షోను చేస్తున్నారు, ఈ షో కు రేటింగ్స్ కూడా ఓ రేంజ్లో వస్తున్నాయి. ఆ రేటింగ్ కు మించి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి తారక్ డోస్ పెంచుతారు అని ఫీల్ అవుతున్నారట. మరి సీజన్ సిక్స్ ని మన సింహాద్రి లీడ్ చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: