బిగ్ బాస్ 5: "సన్నీ"నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

VAMSI
బిగ్ బాస్ అంటే ఫామిలీ అందరూ భోజనాలు చేసి కూర్చుని చూడగలిగే ఒక షో లాగా బాగా ప్రాముఖ్యత చెందినది. ఇప్పటి వరకు జరిగిన 4 సీజన్ లను ప్రజలు ఎంతగానో ఆదరించి సక్సెస్ చేశారు. అదే విధంగా ఇప్పుడు జరుగుతున్న సీజన్ 5 కూడా అంతే ఆదరణ నోచుకుంటోంది. కాగా 19 మంది సభ్యులతో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పుడు 9 మందితో కొనసాగుతోంది. ఇక కొద్ది రోజులే మిగిలి ఉండడంతో ఇంట్లో టైటిల్ కోసం పోటీ ఎక్కువైంది. మొదటి వరం నుండి ఇప్పటి వరకు గేమ్ ను అర్ధం చేసుకుని తమ వంతు ఎఫర్ట్స్ పెడుతున్నారో వారికే ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. వారం వారం వారికీ ప్రేక్షకుల మద్దతు ఎక్కువవుతోంది.
అయితే ప్రస్తుతం ఉన్న ఇంటి సభ్యులలో టైటిల్ పొందే అర్హత ముగ్గురికి మాత్రం ఉందని ఇప్పటికే సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. వారిలో విజె సన్నీ, శ్రీరామచంద్ర మరియు రవి లు ఉన్నారు. వీరిలో ముఖ్యంగా సన్నీకి అంతులేని ప్రజాధారణ దక్కుతోంది. కానీ గత రెండు వారాలుగా హౌస్ లో ఎక్కువగా సన్నీని టార్గెట్ చేస్తున్నారు. మాములుగా టాస్క్ లో భాగంగా జరిగే కొన్ని చిన్న చిన్న గొడవలను పెద్దవి చేస్తూ సన్నీని అన్ని విధాలుగా డౌన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనికి కారణం ఏమిటా అని చాలా మంది సన్నీ అభిమానులు ఆలోచిస్తున్నారు. దీనికి ఒకే ఒక్క కారణం ఉంది.
సన్నీ మొదటి రోజు నుండి ఈ రోజు వరకు ఒకేరకమైన ప్రవర్తనతో మెలుగుతున్నాడు. ఆటలో కొంత వరకు ఆవేశాన్ని తెచ్చుకుంటున్నాడు. కానీ ఈ మధ్య నియంత్రణతో మెలుగుతున్నాడు. అయితే ఇంటి సభ్యులు కొందరు సన్నీ బలహీనతతో ఆడుకుంటున్నారని ప్రజలందరికీ క్లారిటీగా తెలుస్తోంది. అయితే ఇలా చేసే కొద్దీ ఇంకా ప్రజలకు దగ్గరవుతాడు. ఫైనల్ గా సన్నీనే విన్నర్ అవుతాడు. అందుకే తనను దెబ్బతీయడానికి ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో ఏమి జరగనుంది అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: