బిగ్ బాస్ 5: టైటిల్ కోసం వారిద్దరి మధ్యనే పోటీ?

VAMSI
బుల్లి తెరపై బిగ్ బాస్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. స్క్రీన్ పై పాత్రను బట్టి నటించే సెలబ్రిటీలు తమ రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు, వారి గుణగణాలు ఎలా ఉంటాయి అన్న విషయాలను తెలుసుకోవడానికి అందరూ తెగ ఆసక్తి చూపుతుంటారు. అదే పాయింట్ పై రూపొందించబడ్డ ఈ షో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యి వరుస సీజన్ల తో దూసుకుపోతుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయినా పెద్దగా గుర్తింపు లేని సెలబ్రిటీలు అయినా వన్స్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తే చాలు ఇక వారి పేరు ఆల్ ఇండియా మొత్తం మారుమ్రోగాల్సిందే. అంతగా వారు పాపులర్ అవుతారు. ముఖ్యంగా సోషల్ మీడియా బిగ్ బాస్ ఇంటి సభ్యులని బాగా హైలెట్ చేస్తుంది. అయితే ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 నడుస్తున్న విషయం తెలిసిందే.
కరోనా  నేపథ్యం లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఒకేసారి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్ మొత్తం  100 రోజులు కాగా ఇప్పటికీ సీజన్ 5 మొదలయ్యి 50 రోజులు దాటింది. ఎవరు ఎంతో అన్న విషయంపై ప్రేక్షకులకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. చాలా మంది ఇంటి సభ్యులు మొదట్లో ఉన్నట్లు ఇప్పుడు లేరు. కొందరు బాగా మెచ్యూర్ అయితే మరి కొందరు నిరాశతో ఢీలా పడిపోయారు...ఇంకొందరు బ్యాలన్స్ తప్పుతుండగా, మరి కొందరు ఇప్పటికీ వారి స్ట్రాటజీ లను ఉపయోగిస్తున్నారు.  ఇలా కొనసాగుతుండగా బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరనే విషయానికి వస్తే ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీ రామ్.
ఇతడు మొదట్లో హమీద ఉన్న సమయంలో ఎక్కువగా తనతోనే కనిపించేవాడు. తను వెళ్ళాక శ్రీ రామ్ స్లో అయ్యాడని వినిపించినా మళ్లీ గేమ్ లో తన జోరును పెంచాడు శ్రీ రామ్. రాను రాను శ్రీ రామ్ కి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఆయనకు మద్దతు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇక ఆ తరవాత సీజన్ 5 విన్నర్ లిస్ట్ లో వినిపిస్తున్న పేరు రవి. ఈ షోకి రాకముందే రవికి ఫుల్ గా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇపుడు అది మరింత పెరిగింది. హౌజ్ లో తన వైఖరిపై మొదట్లో  కాస్త నెగిటివ్ కామెంట్స్ వినిపించినా...ఇపుడు చాలా వరకు పాజిటివ్ టాక్ ప్రచారమౌతోంది. బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా రవి నిలవాలన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. విన్నర్ లిస్ట్ లో రవి, శ్రీ రామ్ పేర్లు  ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో చివరకు ఏమౌతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: