టీవీ: యాక్టర్ యమున రియల్ లైఫ్ స్టోరీ..!!

Divya
ఈ మధ్య కాలంలో వస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సీరియల్ లో రోజీ పాత్రలో యమున తనదైన శైలిలో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది..ఈ సీరియల్ నటి మాత్రమే కాదు అప్పట్లో సినిమాలలో హీరోయిన్ గా కూడా తనదైన శైలిలో నటించి మంచి గుర్తింపు పొందింది.. అయితే హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలకే పరిమితమైన యమున, ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ సినీ ఇండస్ట్రీలోనే ఈమె ఎక్కువగా నటించింది అని చెప్పుకోవచ్చు.. కానీ ఒకసారి ఎవరో కావాలని ఈమెపై వ్యభిచార నేరం మోపడంతో , అప్పటినుంచి ఈమెకు సినిమాలలో అవకాశాలు రాలేదు.. కానీ తను ఏ తప్పు చేయలేదని.. ఎవరో కావాలనే ఈ రూమర్ సృష్టించారు అని తెలిసిన తర్వాత , ఈమెకు బుల్లితెరపై అవకాశాలు ఎక్కువగా వచ్చాయి..
బిజీ నటీమణిగా బుల్లితెరపై దూసుకుపోతోంది యమున.. రియల్ లైఫ్ విషయానికి వస్తే.. ఈమెకు  చిన్నప్పటి నుంచి డాన్సింగ్ అంటే చాలా ఇష్టం.. కానీ యాక్టింగ్  పైన పెద్దగా ఇష్టం ఉండేది కాదు.. కానీ ఈమె అక్క చిన్నప్పటినుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఒకటి రెండు సార్లు తన అక్క తో కలసి షూటింగ్ కి వెళ్ళిన యమునను.. ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ చూసి.. సుహాసిని నటించిన సిస్టర్ నందిని సినిమా లో సుహాసినికి చెల్లెలి పాత్రలో నటించడానికి అడిగారు. ఇక యమునా అమ్మగారు ఓకే అని చెప్పినప్పటికీ, యమునకు  ఏ మాత్రం ఇష్టం లేదు.. కానీ డైరెక్టర్ కు నో చెప్పే ధైర్యం లేక , తప్పని పరిస్థితులలో షూటింగ్ హాజరైంది. ఇక ఈ సినిమాలో నటించిన తర్వాత యమునకు అవకాశాలు బాగానే వచ్చాయి.
మౌనరాగం ,సూరి గాడు, మామగారు, పుట్టింటి పట్టుచీర, జడ్జిమెంట్ ,ఇన్స్పెక్టర్ రుద్ర, ఎర్రమందారం ఘటన ఇలాంటి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది యమున. అలా సుమారుగా 70 సినిమాలకు పైగా నటించింది. అయితే ఒకసారి ఈమె పై వచ్చిన అభియోగాల కారణంగా చనిపోవాలని అనుకున్న సమయంలో, ఈమె భర్త, పిల్లల కోసం ఎలాగైనా సరే కష్టాలను ఎదుర్కోవాలని ధైర్యంగా నిలబడింది. ఈమె పేరు ప్రేమ కానీ సిస్టర్ నందిని సినిమాలో ఈమె పేరును కె.బాలచందర్ యమునగా మార్చారు. ఇక మొదట విధి అనే సీరియల్ ద్వారా బుల్లితెర పై అడుగులు వేసిన యమున ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: