టీవీ: నా పేరు మీనాక్షి ఫేమ్ శ్రీరామ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

Divya
ఈ మధ్యకాలంలో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్స్ లో నా పేరు మీనాక్షి సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ ప్రతిరోజు ఈటీవీ లో రాత్రి8:30 నిమిషాలకు ప్రసారం అవుతుంది. ఇందులో నటించే ప్రతి నటీనటులు కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో కాకుండా టీవీ లకు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తున్నారు. ఈ సీరియల్ వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ప్రేక్షకులలో మాత్రం మంచి ఆదరణ పొందుతోంది. ఈ సీరియల్ లో ఈ మధ్యనే బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన శ్రీరామ్.. అందం, అభినయం.. మంచి పర్సనాలిటీ , హైట్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు..
ఈ సీరియల్ లో మీనాక్షి భర్త క్రిష్ మళ్ళీ తిరిగి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.. కానీ  ఈ సీరియల్లో మీనాక్షికి ఫుల్ సపోర్టు ఇస్తూ శ్రీరామ్.. ఆమెను ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా చూసుకోవడంతో నిజంగానే క్రిష్ మారురూపంలో వచ్చాడా ఏంటి అని అనుకుంటున్నారు. అయితే శ్రీరామ్ క్రిష్ ఆ  కాదా అని తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.. ఇకపోతే శ్రీరామ్ వ్యక్తిగత విషయాలను మనం ఒకసారి చదివి తెలుసుకుందాము..
శ్రీరామ్ అసలు పేరు వెంకట భూమి రెడ్డి. ఇతను పుట్టింది హైదరాబాద్లోనే.. ఈయనకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఇక అతడి పేరు శ్రీనివాస భూమిరెడ్డి. విద్యాభ్యాసం విషయానికి వస్తే పాఠశాల విద్యాభ్యాసం అంతా ప్రగతి హై స్కూల్ లో.. ఉన్నత విద్య కోసం సెయింట్ మేరీ కాలేజీలో డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఇక ఈయన కూడా అందరిలాగే మొదట షార్ట్ ఫిలిం స్టార్ట్ చేసాడు. రంగుల కలలు ,వసుదైక కుటుంబం షార్ట్ ఫిలిమ్స్ నటించడమే కాకుండా కొన్ని మూవీస్ లో కూడా నటించాడు. ప్రేమిక ,ఓ మనసా ఎవరి కోసం, మైత్రివనం, ప్రేక్షకుడు, రాయలసీమ లవ్ స్టోరీ ఇలా కొన్ని సినిమాలలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: