బిగ్ బాస్ 5: శ్రీరామ్ కు ఏమైంది... హమీదా వల్లే ఇంతలా మారాడా?

VAMSI
ప్రస్తుతం గత ఆరు వారాలుగా ఎంతో విజయవంతంగా టెలికాస్ట్ అవుతున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిన విషయమే. ఈ షో సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతున్నప్పటికీ అప్పటి వరకు ప్రేక్షకులు ఎదురు చూసి షో ను ఆదరిస్తూ వస్తున్నారు. అందుకే టీఆర్పీ రేటింగ్ లోనూ దూసుకెళుతోంది బిగ్ బాస్ షో. ఇదిలా ఉంటే గత వారం హౌజ్ నుండి హమీదా ఎలిమినేట్ అయింది. కానీ ఈ ఎలిమినేషన్ ను ఈ ఒక్క ప్రేక్షకుడు కానీ లేదా హౌజ్ లో ఉన్న తోటి సభ్యులు కానీ ఊహించలేదు. అలా సడెన్ గా బిగ్ బాస్ హౌజ్ నుండి వెళ్ళిపోయింది. అయితే ఈమె వెళ్లిపోవడం ఎవరినీ అంత బాధ పెట్టకపోయినా, శ్రీరామచంద్రను మాత్రం ఎంతో వేదనకు గురి చేసింది.
వీరిద్దరూ హౌస్ లో ఎంతో ప్రేమగా ఉంటూ వచ్చారు. ఒకరికొకరు తోడుగా నీడగా రియల్ లైఫ్ లో ఎలా అయితే ఒకరి కోసం ఒకరు జీవిస్తారో అదే అనుభూతిని కలిగించారు ఈ జంట. కానీ ఆమె వెళ్ళాక శ్రీరామ చంద్ర లో ఎదో తెలియని మార్పు వచ్చింది. ఇది ఇంటి సభ్యులు మరియు ప్రేక్షకులు అందరికీ అర్థమయింది. హమీదా తో శ్రీరామ్ కు ఉన్న అటాచ్మెంట్ కారణంగా ఆమె లేని బిగ్ బాస్ ఇంట్లో మునుపటిలా ఉండలేక, గేమ్ ను సరిగా ఆడలేక ఇబ్బంది పడుతున్నాడు. ఎప్పుడూ అందరితో సంతోషంగా  ఉండే సింగర్ శ్రీరామ్ ఇప్పుడు ఎంతో నిరాశగా కనిపిస్తున్నాడు. శ్రీరామ్ అభిమానులు సైతం ఎంతో బాధపడుతున్నారు.
కేవలం హామీదా ఎలిమినేషన్ శ్రీరామ్ లో ఎంత మార్పుకు కారణమయింది అంటే ఇది ఒక మనిషిని ప్రేమ ఎంతలా మార్చగలదో అన్న దానికి ఉదాహరణగా చెప్పుకోవాలి. అందుకే బిగ్ బాస్ హౌజ్ లో రిలేషన్స్ పెట్టుకోవద్దు. గేమ్ మాత్రమే ఆడాలని తెలుసుకోవాలని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి ముందు ముందు అయినా శ్రీరామ్ ప్రవర్తనలో మార్పు రావాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: