"దేవత" సీరియల్ లో రుక్మిణిని చివరకు ఏంచేయనున్నారు?

VAMSI
మా టీవిలో దేవత సీరియల్ ఎంతో పాపులర్. ఈ సీరియల్ లో రుక్మిణి గా నటిస్తున్న సుహాసిని కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. దానికి కారణం ఆమె నటనే, ఎంతో స్టైల్ గా కనిపించే సుహాసిని అచ్చం పల్లెటూరి అమ్మాయిలా కట్టు బొట్టు మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్, ముఖంలో ఆ హావభావాలు అన్ని ఒక అచ్చమైన పల్లెటూరి అమ్మాయిని తలపిస్తూ తన నటనతో అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది. చంటిగాడు సినిమా హీరోయిన్ గా చేసిన ఈమె ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి బుల్లి తెర వైపుకు మర్లింది. ఇక్కడ స్మాల్ స్క్రీన్ పై హీరోయిన్ గా మెప్పించి అందరి మన్ననలు పొందుతూ ప్రముఖ సీరియల్స్ లలో లీడ్ రోల్స్ చేస్తోంది.
ఇక ఈమె ప్రస్తుతం దేవత సీరియల్ లో ప్రధాన భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా రాధగా తన కూతురితో బ్రతుకుతున్న ఆమె మళ్ళీ ఆదిత్యకు దగ్గర అవుతుందా లేదా.. మళ్ళీ ఆదిత్య జీవితంలోకి రుక్కు కనుక ప్రవేశిస్తే సత్య పరిస్థితి ఏంటి.. ఆ క్యారెక్టర్ కు ఎలా న్యాయం చేస్తారు లేదా ఎలా ఎండ్ చేస్తారు అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇంకో వారంలో రాధగా బ్రతుకుతున్నది రుక్మిణి నే అని దేవుడు అమ్మతో సహా అందరికీ తెలిసిపోనుందట..ఆ తర్వాత రుక్కు మాధవ్ ని నిజంగానే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనింది అని అంత అపార్థం చేసుకొని అందరూ నిందలు వేస్తూ దూషిస్తారట.
ఇలా ఒక రెండు మూడు నెలలు పాటు సీరియల్ సాగనుందని సమాచారం. ఆ తర్వాత రుక్మిణి అసలు మాధవ్ ని పెళ్లి చేసుకోలేదని దేవి ఆదిత్య బిడ్డే అని రంగ..రమ్యలు ద్వారా అసలు నిజం బయటపడనుందని  తెలుస్తోంది. ఇక అక్కడి నుండి కథని మళ్ళీ ఎలా మలుపు తిప్పుతారో చూడాలి. అయితే కథలో ఎన్ని మలుపులున్నా కానీ ఆదిత్య రుక్మిణికి దగ్గరయితే చాలని కొందరు అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి రుక్మిణి పాత్రణలు మాత్రం డైరెక్టర్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: